అమెజాన్ సేల్.. 50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్..!
శాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M55s 5G) భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ తొలి సేల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 లో భాగంగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ శాంసంగ్ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 45W ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ ను అమెజాన్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale 2024) భాగంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఇందుకు ఎటువంటి క్రెడిట్, డెబిట్ కార్డుల అవసరం లేదు. కూపన్ ద్వారా ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు SBI కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. రూ.2,000 తగ్గింపు అనంతరం ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.17,999 గా ఉంటుంది. బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ సూపర్ అమెలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ టెక్నాలజీ ని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 256GB గరిష్ఠ స్టోరేజీని కలిగి ఉంటుంది. వర్చువల్‌గా 8GB అదనపు ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI 6.1 OS ను కలిగి ఉంది.

50MP + 8MP+ 2MP+ 50MP సెల్ఫీ కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2 GPS,సహా మరిన్ని ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications







