Home
Mobile

రూ.3800 డిస్కౌంట్‌తో 50MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే శాంసంగ్ ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్‌ నుంచి రూ.20 వేల ధర రేంజ్‌ లో అనేక ఫోన్‌లు ఉన్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన అనేక మోడల్స్‌ ప్రస్తుతం డిస్కౌంట్‌ తో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

విడుదల సమయంలో ధర :
శాంసంగ్‌ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M55s 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమోజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M55s 5G smartphone telugu news

రూ.3500 డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌ లో ఈ శాంసంగ్‌ హ్యాండ్‌సెట్‌ 128GB స్టోరేజీ ధర రూ.16,200 గా ఉంది. అంటే సుమారుగా రూ.3800 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. మరో వేరియంట్‌ ప్రస్తుతం అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ కోరల్ గ్రీన్‌, థండర్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ M55s 5G ఫోన్‌ పూర్తి వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.7 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్‌ టెక్నాలజీ సపోర్టును కలిగి ఉంది.

Samsung Galaxy M55s 5G smartphone telugu news

స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 6.1 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చి ఉంది. ఈ ఫోన్‌ ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

5000mAh బ్యాటరీ :
ఈ హ్యండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్‌ 5.2, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M55s 5G smartphone with 50MP selfie Camera gets best deal on Amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X