శాంసంగ్ ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్.. 6 సంవత్సరాల అప్‌డేట్స్, ట్రిపుల్ కెమెరాలు, 6.73 అంగుళాల డిస్‌ప్లే..!
Samsung Galaxy M56 5G Smartphone : ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 7.2mm థిక్‌నెస్ తో స్లిమ్ ఫోన్‌గా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ లో మరో ప్రత్యేక కూడా ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ పొందుతుంది. దీంతోపాటు ఈ ఫోన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. మరియు సూపర్ అమోలెడ్ ప్లస్‌ను కలిగి ఉంది.
భారత్ మార్కెట్ లో శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,998 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకుల కార్డులపై రూ.3000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే? :
అమెజాన్ ఆధారంగా ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు మెటల్ క్యామ్ డెకో గ్లాస్ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా కోర్ Exynos 1480 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ హ్యాండ్‌సెట్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
ట్రిపుల్ కెమెరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు AI image Clipper, AI Edit Suggestions, AI Object Eraser ఫీచర్లున్నాయి. 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C వంటి ఫీచర్లున్నాయి.


Click it and Unblock the Notifications








