Home
Mobile

రూ.3 వేల డిస్కౌంట్‌తో 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరా, 45W ఛార్జింగ్ 5G స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. గెలాక్సీ M సిరీస్‌ లో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M56 5G Smartphone) లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ సన్నని డిజైన్‌తోపాటు 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.3 వేల డిస్కౌంట్‌ :
అమెజాన్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉంది. అన్ని బ్యాంకుల కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌ వంటి రెండు కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Samsung Galaxy M56 5G Smartphone telugu news

సన్నని స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు మెటల్‌ క్యామ్ డెకో గ్లాస్‌ ప్యానల్‌ ను కలిగి ఉంది. మరియు 7.2mm థిక్‌నెస్‌ ను మాత్రమే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.73 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ + ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4nm ఆక్టా కోర్‌ Exynos 1480 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ ను కూడా కలిగి ఉంది.

Samsung Galaxy M56 5G Smartphone telugu news

ట్రిపుల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ లెన్స్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇమేజింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో image Clipper, Edit Suggestions, Object Eraser వంటి ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G LTE, WiFi, బ్లూటూత్‌ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ విజన్‌ బూస్టర్‌ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M56 5G Smartphone gets rs3000 discount on amazon here are the features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X