శాంసంగ్ నుంచి మరో 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ వెల్లడి.. 50MP ప్రైమరీ కెమెరా, సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లే!
టెక్ దిగ్గజం శాంసంగ్ ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎంట్రీ లెవల్ ధర నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. గత నెలలో గెలాక్సీ A26, A36, A56 స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా శాంసంగ్ నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ నెలలో మరో ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M56 5G Smartphone) భారత్ మార్కెట్‌లో ఏప్రిల్ 17 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ M55 కు తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ :
గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ 7.2mm థిక్‌నెస్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.
స్లిమ్ బెజెల్స్ :
గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ M55 హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే.. ఏప్రిల్ 17న లాంచ్ కానున్న గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 30 శాతం స్లిమ్ డిజైన్‌తో లాంచ్ కానుంది. మరియు 36 శాతం సన్నని బెజెల్స్, 33 శాతం బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ Exynos 1480 SoC ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 12MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.
ఈ కెమెరా విభాగం అనేక ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ కెమెరా 10 బిట్స్ HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు బిక్ పిక్సల్ టెక్నాలజీ, లో నాయిస్ మోడ్, AI ISP సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ నుంచి గెలాక్సీ S25 ఎడ్జ్ హ్యాండ్‌సెట్ కూడా త్వరలో విడుదల కానుంది. ఈ ఫోన్ అల్ట్రాస్లి్‌మ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టైటానియం ఐసీ బ్లూ, టైటానియం జెట్ బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎడ్జ్ హ్యాండ్‌సెట్ 200MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications