5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.73 అంగుళాల సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లే శాంసంగ్ ఫోన్ విడుదల.. రూ.3000 డిస్కౌంట్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ శాంసంగ్ ఈ సంవత్సరం భారత్ మార్కెట్‌లో ఎంట్రీ, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ ధర సెగ్మెంట్‌లో వరసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. త్వరలో గెలాక్సీ S25 ఎడ్జ్ మోడల్ కూడా లాంచ్ కానుంది. అయితే తాజాగా భారత్ లో శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M56 5G Smartphone Launched) విడుదల అయింది. ఈ ఫోన్ 7.2mm థిన్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. గత సంవత్సరం లాంచ్ అయిన గెలాక్సీ M55 5G ఫోన్‌కు తర్పాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 7.2mm థిక్‌నెస్‌తో 6.73 అంగుళాల ఫుల్ HD+ (1080*2340 పిక్సల్స్) సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మరియు విజన్ బూస్టర్ సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
శాంసంగ్ M సిరీస్ కొత్త ఫోన్ ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 skin ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కోసం 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా HDR వీడియోను సపోర్టు చేస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు :
గెలాక్సీ M56 5G ఫోన్ కెమెరా విభాగం Object Eraser, ఇమేజ్ క్లిప్పర్, Edit Suggestions వంటి AI ఇమేజింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఏప్రిల్ 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








