రూ.3000 డిస్కౌంట్‌తో 50MP కెమెరా, 6.73 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఫోన్.. 6 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చు..!
శాంసంగ్ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇటీవల మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్‌లో గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ సన్నని డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. మరియు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 6 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందనుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ (Samsung Galaxy M56 5G Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ధర, సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30,999 గా ఉంది. ఇవాళ (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రెండు కలర్ వేరియంట్స్ :
గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, లైట్ గ్రీన్ వంటి రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాలని భావిస్తే ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
సెగ్మెంట్‌లోనే సన్నని ఫోన్! :
శాంసంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదల అయిన గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్ కంటే సన్నని డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. 7.2mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. సెగ్మెంట్‌లోనే స్లిమ్ ఫోన్‌గా గుర్తింపు పొందిందని శాంసంగ్ చెబుతోంది. అలాగే వెనుక వైపు మెటల్ క్యామ్ డెకో గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ 6.73 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2340 పిక్సల్స్ రిజల్యూషన్‌తోపాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే విజన్ బూస్టర్ సపోర్టును చేస్తుంది.
6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా కోర్ Exynos 1480 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 skin ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫీచర్‌లు :
దీంతోపాటు ఈ ఫోన్ AI ఇమేజింగ్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఇదులో Object Eraser, Image Clipper, Edit Suggestions వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ 5G, 4G LTE, WiFi, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లున్నాయి.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications