ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్’
అక్టోబర్‌లో ఆవిష్కరించారు:
గెలాక్సీ మ్యూజిక్‌ను సామ్‌సంగ్ అక్టోబర్‌లో ఆవిష్కరించింది. డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ప్లాట్‌ఫామ్ పై స్పందిస్తుంది. 3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ స్ర్కీన్, ప్రాసెసర్ వివరాలు తెలియాల్సి ఉంది. డ్యూయల్ అలాగే సింగిల్ సిమ్ వర్షన్‌లలో హ్యాండ్‌సెట్ లభ్యమవుతోంది. మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దుకున్నగెలాక్సీ మ్యూజిక్‌లో ఎస్ఆర్ఎస్ ఆడియో మోడ్‌లతో కూడిన సౌండ్ ఎలైవ్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు. మ్యూజిక్ ప్లేయర్ mp3, OGG, AAC, AAC+, eAAC+, amr-nb, amr-wb, wav, mid, imy, flac, wma తదిరత ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది.
స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:
3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్లువిటీ, ఎడ్జ్/జీపీఆర్ఎస్, వై-ఫై బి/జి/ఎన్, వై-ఫై డెరెక్ట్,
జీపీఎస్ విత్ గ్లోనాస్,
బ్లూటూత్ వీ.3.0, యూఎస్బీ 2.0,
3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ యాంటీనా.


Click it and Unblock the Notifications









