సామ్‌సంగ్ మ్యూజిక్ ఫోన్స్ త్వరలో.. (ఆడియో క్వాలిటీ కెవ్వు..కేక)
oi
-Prashanth
By Prashanth
ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థగా గుర్తింపుతెచ్చుకున్నసౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ వరుస ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. తాజాగా గెలాక్సీ నోట్ 2ను విడుదలచేసి మంచి హుషారు మీదున్న సామ్‌సంగ్ త్వరలో మ్యూజిక్ ప్రధానకర్షణగా ఓ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుందని సామీహబ్(SammyHub) రిపోర్టులు వెల్లడించాయి. రిపోర్టులో పేర్కొన్న సమాచారం మేరకు ఈ మ్యూజిక్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ పేరు ‘గెలాక్సీ మ్యూజిక్’. అత్యుత్తమ ఆడియో క్వాలిటీని ఉత్పత్తి చేసే ఈ సొగసరి హ్యాండ్‌సెట్ మ్యూజిక్ అభిమానులకు హాట్ ఫేవరెట్‌గా నిలవనుందని మార్కెట్ వర్గాల అంచనా. సింగిల్ సిమ్, డ్యూయల్ సిమ్ వర్షన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతుంది. వీటి పేర్లు గెలాక్సీ మ్యూజిక్ (జీటీ-ఎస్6010), గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్ (జీటీ-ఎస్6012).
ఫీచర్లు అంచనా:
3 అంగుళాల టచ్‌స్ర్కీన్(QVGA రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1కు అప్‌గ్రేడబుల్),
850మెగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512ఎంబీ ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై 802.11 b/g/n,
జీపీఎస్,
బ్లూటూత్ వీ3.0,
మైక్రో యూఎస్బీ 2.0,
ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (చాట్ ఆన్, జీటాక్, గూగుల్ +, గూగుల్ మ్యాప్స్, సామ్ సంగ్ అప్లికేషన్స్, మ్యూజిక్ హబ్, గేమ్ హబ్ లైట్),
ధర వివరాలు తెలియాల్సి ఉంది.
సామ్‌సంగ్ ఈ ఫోన్‌లను అక్టోబర్ 12న జర్మనీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనుంది.