సామ్‌సంగ్ గెలాక్సీ మ్యూజిక్ vs సోనీ ఎక్స్‌పీరియా జే (ఏది ఉత్తమమైన మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్..?)

By Super
|
 Samsung Galaxy Music vs Sony Xperia J: Which is a Better Music Smartphone?


స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోన్న సామ్‌సంగ్, మ్యూజిక్ ప్రధానాంశంగా ‘గెలాక్సీ మ్యూజిక్’స్మార్ట్‌ఫోన్‌‌ను తాజాగా ఆవిష్కరించింది. ఈ డివైజ్ రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది. స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లు వెల్లడైనప్పటికి ధర ఇతర విడుదల వివరాలను సామ్‌సంగ్ వెల్లడించలేదు. మరో వైపు జపనీస్ టెక్ దిగ్గజం సోనీ, ‘ఎక్స్‌పీరియా జే’ పేరుతో ఓ మ్యూజిక్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఐఎఫ్ఏ 2012 ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లో లోడ్ చేసిన్ ‘వాక్‌మెన్ ఫీచర్’ ఉత్తమ క్వాలిటీ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల పై వినియోగదారుకు ఖచ్చితమైన అవగాహన కలిగించే విధంగా రెండు డివైజ్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

బరువు ఇంకా చుట్టుకొలత....

గెలాక్సీ మ్యూజిక్: 110.1 x 59.0 x 12.25మిల్లీమీటర్లు, బరువు 107 గ్రాములు,

ఎక్స్‌పీరియా జే: 124.3 x 61.2 x 9.2మిల్లీమీటర్లు, బరువు 124 గ్రాములు,

డిస్‌ప్లే.....

గెలాక్సీ మ్యూజిక్: 3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, (డిస్‌ప్లే రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),

ఎక్స్‌పీరియా జే: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, (డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), బ్రావియా మొబైల్ ఇంజన్,

ప్రాసెసర్......

గెలాక్సీ మ్యూజిక్: తెలియాల్సి ఉంది.

ఎక్స్‌పీరియా జే: 1గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

గెలాక్సీ మ్యూజిక్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, సూపర్ స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్.

ఎక్స్‌పీరియా జే: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, సూపర్ స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్.

కెమెరా.....

గెలాక్సీ మ్యూజిక్: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

ఎక్స్‌పీరియా జే: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేుందుకు),

స్టోరేజ్.....

గెలాక్సీ మ్యూజిక్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఎక్స్‌పీరియా జే: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ....

గెలాక్సీ మ్యూజిక్: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

ఎక్స్‌పీరియా జే: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

బ్యాటరీ....

గెలాక్సీ మ్యూజిక్: 1300ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాల తెలియాల్సి ఉంది)

ఎక్స్‌పీరియా జే: 1750ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7.5 గంటలు, స్టాండ్‌బై 25 రోజులు),

తీర్పు:

మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ మ్యూజిక్‌ను డిజైన్ చేయటంతో స్పెసిఫికేషన్‌ల పరంగా సోనీ ఎక్స్‌పీరియా జేతో పోలిస్తే వెనుకంజలో ఉంది. అయినప్పటికి గెలాక్సీ మ్యూజిక్‌లో ఉన్న ఆండ్రాయి ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, సౌండ్ యలైవ్, ఎస్‌ఆర్‌ఎస్ టెక్నాలజీ వంటి ఆడ్వాన్సుడ్ సాఫ్ట్‌వేర్‌లు ఆకట్టుకుంటాయి. స్పెసిఫికేషన్‌ల పరంగా ఆలోచించే వారికి ఎక్స్‌పీరియా జే ఉత్తమ ఎంపిక.. పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ కెమెరా ఆప్షన్స్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్, వాక్‌మెన్, ఆల్బమ్ వంటి ప్రత్యేక ఫీచర్లు డివైజ్‌లో ఒదిగి ఉన్నాయి.

Read in English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X