ట్విట్టర్‌లో ఆ ఫోటో..?

గూగుల్, సామ్‌సంగ్ సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధి చెందిన నెక్సస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకున్న విషయం తెలిసిందే. వీరద్దరి కాంభినేషన్‌లో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ నెక్సస్, 2011 అక్టోబర్‌లో విడుదలైనప్పటికి యూరోప్, అమెరికాలకే పరిమితమయ్యింది. తాజాగా ఈ డివైజ్‌కు సంబంధించిన అనధికారిక సమాచారం నెట్ ప్రపంచంలో హాల్‌చల్ చేస్తోంది.
బీజీఆర్ రిపోర్టుల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు @lastavenger అనే ట్వీట్టర్ యూజర్ ‘గెలాక్సీ నెక్సస్’ బెంగుళూరులోని సామ్‌సంగ్ స్టోర్‌లో రూ.25,900 ధరకు లభ్యమవుతున్నట్లు ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగం కనిపించే విధంగా ఓ ఫోటోను సైతం సదురు వ్యక్తి పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో వాస్తవం లేదని సామ్‌సంగ్ అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.
గెలాక్సీ నెక్సస్ ఫీచర్లు:
4.6 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 8.5 గంటలు, స్టాండ్ బై 270గంటలు).


Click it and Unblock the Notifications







