మార్చిలో మన ఇంటికి..?

Posted By: Prashanth

మార్చిలో మన ఇంటికి..?

 

మార్చిలో ఇండియాకు రానున్న ఆండ్రాయిడ్ 4.0 వోఎస్ ఆధారిత తొలి స్మార్ట్‌ఫోన్ పై అంచనాలు జోరందుకున్నాయి. శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి ‘నెక్సస్’ నమూనాలో వస్తున్న ఈ డివైజ్ స్వచ్చమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని రంగరించుకుని ఉంటుంది. ఫీచర్ రిచ్ మరియు యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై ఈ మొబైల్ రన్ అవుతుంది. 16 మిలియన్ రంగులతో సుసంపన్నమైన ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్‌ను ఈ డివైజ్‌లో ఏర్పాటు చేశారు.

డిస్‌ప్లే పరిమాణం 4.65 అంగుళాలు. ఫోన్ స్టోరేజ్ అంశాలను పరిశీలిస్తే దోహదం చేసిన ఇంటర్నల్ మెమెరీ 16, 32జీబి వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఆటోఫోకస్ వ్యవస్థను కలిగి మన్నికైన ఫోటోలను విడుదల చేస్తుంది. 1080పిక్సల్ సామర్ధ్యంతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అవసరమైన మల్టీమీడియా అప్లికేషన్‌లను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 2జీ, 3జీ నెట్ వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ 290 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot