శ్యామ్‌సంగ్ .. ‘సమ్ థింగ్.. సమ్ థింగ్’..!!

Posted By: Super

శ్యామ్‌సంగ్ .. ‘సమ్ థింగ్.. సమ్ థింగ్’..!!

సాంకేతిక పరికరాల మార్కెట్లో ‘నేటి.. మేటి’గా దూసుకుపోతున్న శ్యామ్‌సంగ్ మరో వినూత్న ఒరవడికి తెరలేపనుంది. ఇప్పటికే మార్కెట్లో ‘ గెలక్సీ’ స్మార్ట్ ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలను విడుదల చేసి విజయడంఖా మోగించిన ఈ బ్రాండ్ వినియోగదారులకు ‘సమ్ థింగ్.. సమ్ థింగ్’ స్పెషాలిటీని చూపించబోతుంది.

టాబ్లెట్ పీసీ ఫీచర్లతో పాటు స్మార్ట్ ఫోన్ స్వభావం కలిగిన మల్టీపర్పస్ పరికరాన్ని మార్కెట్లో విడుదలు చేసుందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది. ‘శ్యామ్ సంగ్ గెలక్సీ నోట్’ పేరుతో విడుదల కాబోతున్న ఈ పరికరం 5.3 అంగుళాల AMO LED టచ్ స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దకుంటున్న ‘గెలక్సీ నోట్’లో 1.4 జీగాహెడ్జీ డ్యూయల్ కోర్ ప్రొసెసర్ వంటి మెరుగైన వ్యవస్థలు సామర్ధ్యం కలిగిన పనితీరును ప్రదర్శిస్తాయి.

పొందుపరిచిన 8 మోగా పిక్సల్ రేర్ కెమెరా నాణ్యమైన చిత్రాలను తీసుకునేందుకు ఉపకరిస్తుంది. పొందుపరిచిన 2 మోగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియో కాన్ఫిరెన్సు నిర్వహించుకోవచ్చు. జీబీని ఎక్స్‌టర్నల్ విధానం ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు. క్యాలెండర్ సింక్రనైజేషన్, సోషల్ నెటవర్కింగ్, శ్యామ్‌సంగ్ ఆప్లికేషన్స్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఆండ్రాయిడ్ మార్కెట్ వంటి ఆప్లికేషన్లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.

ఎంపత్రీ, డబ్ల్యూఎమ్ఏ, డబ్ల్యూఏవి, ఏఎమ్మార్, ఏఏసీ, ఫ్లాక్, ఆగ్ , ఎంపీ4, హెచ్.264, హెచ్.263, డబ్ల్యూఎమ్వీ, డివిక్స్ వంటి ఆడియో, వీడియో ఫార్మాట్లను సహకరించే విధంగా ఆడియో, వీడియో ప్లేయర్లను రూపొందించారు. పటిష్టమైన లయోన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేగవంతమైన 802.11 వై - ఫై వ్యవస్థ, 3.1 ఆధునిక వర్షన్ బ్లూటూత్ అంశాల సమాచారా వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయి. ‘గెలక్సీ నోట్’ ధర విషయానికి వస్తే రూ.30000గా ఉండవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot