‘మెగా ఫ్యాన్స్’ పండుగ చేసుకునే వార్త?

Posted By: Staff

‘మెగా ఫ్యాన్స్’ పండుగ చేసుకునే వార్త?

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 10.1’ ఈ అగష్టులో విడుదలకాబోతుంది. కంప్యూటింగ్ అదేవిధంగా మొబైలింగ్ అవసరాలను సమృద్ధిగా తీర్చే ఈ గ్యాడ్జెట్ కీలక వివరాలను సోమవారం సామ్‌సంగ్ వర్గాలు బహిర్గతం చేశాయి.

ఫాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లు:

1.4గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ సామర్ధ్యం 2జీబి. 10.1 అంగుళాల WXGA ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, గ్యాడ్జెట్‌ను మరింత సులువుగా ఆపరేట్ చేసుకునేందుకు ‘పెన్ స్టైలస్ వ్యవస్థ’. ఆండ్రాయిడ్ 4.0

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్. మూడు కనెక్టువిటీ ఆప్షన్‌లలో గెలాక్సీ నోట్ 10.1 లభ్యం కానుంది. వాటి వివరాలు:

వై-ఫై మాత్రమే,

వై-ఫై + 3జీ హెచ్ ఎస్ పీఏ ప్లస్,

వై-ఫై + ఎల్ టీఈ (ఈ వర్షన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది).

ధర:

గెలాక్సీ నోట్ 10.1 ధరకు సంబంధించిన వివరాలను సామ్ సంగ్ వర్గాలు వెల్లడించలేదు. విశ్వసనీయంగా అందింన వివరాల మేరకు గెలాక్సీ నోట్ 10.1 యూఎస్ మార్కెట్ ధర రూ.41890.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting