శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ సేల్స్ ప్రారంభం రేపటినుంచే... సేల్స్ ఆఫర్స్ ఇవే...

|

శామ్‌సంగ్ యొక్క తాజా ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 10 లైట్ మరియు దీని పోటీదారు మిడ్-రేంజ్ ఫోన్‌లైన వన్‌ప్లస్ 7T సిరీస్ యొక్క సేల్స్ ఇప్పుడు ఇండియాలో జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. శామ్‌సంగ్ యొక్క తాజా ఫోన్ గెలాక్సీ నోట్ 10 లైట్ యొక్క ధర వన్‌ప్లస్ 7T సిరీస్ ఫోన్‌లకు దగ్గరగా ఉన్నాయి.

గెలాక్సీ నోట్ 10 లైట్

గెలాక్సీ నోట్ 10 లైట్ గెలాక్సీ నోట్ 10 యొక్క కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్. ఇది గెలాక్సీ S10 లైట్‌తో పాటు గత నెల ప్రారంభంలో CES 2020 లో ఆవిష్కరించబడింది. కొత్త "లైట్" మోడళ్లతో సరసమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్స్ లను తీసుకురావాలని శామ్‌సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం

ధరలు మరియు లభ్యత వివరాలు

ధరలు మరియు లభ్యత వివరాలు

శామ్సంగ్ సంస్థ గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్‌ను రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదల చేసింది. గెలాక్సీ నోట్ 10 లైట్ యొక్క 6GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల బేస్ మోడల్ రూ.38,999 ధర వద్ద మరియు 8GB + 128GB మోడల్‌ రూ.40,999 ధర వద్ద లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల యొక్క సేల్స్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 12:00 నుండి ఫ్లిప్ కార్ట్ లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు వీటిని ఆరా గ్లో, ఆరా బ్లాక్ మరియు ఆరా రెడ్ వంటి కలర్ లలో ఎంచుకునే అవకాశం ఉంది.

 

 

ఫేస్‌బుక్‌లో హిస్టరీని డెలిట్ చేయడానికి కొత్తగా ఫేస్‌బుక్‌లో హిస్టరీని డెలిట్ చేయడానికి కొత్తగా "క్లియర్ హిస్టరీ" ఆప్షన్

ఆఫర్స్ వివరాలు

ఆఫర్స్ వివరాలు

వీటి యొక్క సేల్స్ ఆఫర్‌ల విషయానికొస్తే రూ.4 వేల అప్‌గ్రేడ్ ప్రమోషన్‌తో ఆకర్షణీయమైన బోనస్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను శామ్‌సంగ్ అందిస్తున్నది. అర్హతగల ఫోన్ల మీద రూ.17050 ఎక్స్ఛేంజ్లో కొనుగోలుదారులు రూ.4,000 వరకు అధిక డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు మీద 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మరియు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్,డెబిట్ కార్డు మీద రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉంటుంది. ఇది 6.7-అంగుళాల ఫుల్ HD + ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 1080 x 2400 పిక్సెల్స్ రెజల్యూషన్,394ppi పిక్సెల్ సాంద్రత మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది 2.7GHz ఎక్సినోస్ 9810 ఆక్టా-కోర్ SoC తో రన్ అవుతుంది. ఇది 6GB మరియు 8GB RAM ఎంపికలతో మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడి ఉంటుంది. మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

 

 

ఒప్పో నుంచి తొలిసారిగా స్మార్ట్ వాచీఒప్పో నుంచి తొలిసారిగా స్మార్ట్ వాచీ

కెమెరా

కెమెరా

ఇందులో గల కెమెరాల విషయానికొస్తే గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ మరియు ఓఐఎస్ లతో ఎఫ్ / 1.7 లెన్స్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మూడవ కెమెరా ఉన్నాయి. ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఫీచర్స్

ఫీచర్స్

గెలాక్సీ నోట్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉండడంతో పాటుగా ఇది స్టయిలిష్ S పెన్ మద్దతుతో వస్తుంది. స్టైలస్ బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE స్టాండర్డ్) కు మద్దతు ఇస్తుంది. ఇందులో మల్టీమీడియా కంట్రోల్, పిక్చర్ క్లిక్ చేయడం మరియు ఎయిర్ కమాండ్స్ వంటి సాధారణ లక్షణాలను అందిస్తుంది. ఈ ఫోన్ 76.1 x 163.7 x 8.7mm కొలతలను కలిగి ఉండి 199 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 10 Light Sale Starts Tomorrow: Price in India, Specifications, and Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X