Home
Mobile

మెగా ఫ్యామిలీ సంచలనం.. 60 రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్!

By Super
Samsung Galaxy Note 2: Android Jelly Bean Phablet Marks 5 Million Sales in 60 Days


పేటెంట్ హక్కులకు సంబంధించి ఆపిల్ నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. 2012కుగాను ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసిన అమ్మకాల గణంకాలను పరిశీలిస్తే.. మొదటి త్రైమాసపు అమ్మకాలు 42.2 మిలియన్ యూనిట్లు, రెండవ త్రైమాసపు అమ్మకాలు 52 మిలియన్ యూనిట్లు, మూడవ త్రైమాసపు అమ్మకాలు 55 మిలియన్ యూనిట్లు, నాలుగవ త్రైమాసికానికిగాను అమ్మకాల మొత్తాన్ని 61.5మిలియన్ లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన గెలాక్సీ ఎస్3 (స్మార్ట్‌ఫోన్) అలాగే గెలాక్సీ నోట్ 2 (ఫాబ్లెట్)లు సామ్‌సంగ్ అమ్మకాలను అమాంతం పెంచాయి. గెలాక్సీ ఎస్3 అమ్మకాలు విడుదలైన నాటి నుంచి 5 నెలల కాల వ్యవధిలో 30 మిలియన్ యూనిట్లను అధిగమించగా, గెలాక్సీ నోట్ 2, కేవలం 90 రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును అధిగమించగలిగింది. ఈ గణంకాలను సామీహబ్ వెల్లడించింది.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువచేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.39,990. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఇతర ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించి http://www.goprobo.com/లోకి లాగిన్ కాగలరు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X