ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ 2.. ఉత్తమ ఎంపికా లేకా ఐఫోన్5 కోసం ఆగాల్సిందేనా..?

Posted By: Prashanth

ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ 2.. ఉత్తమ ఎంపికా లేకా ఐఫోన్5 కోసం ఆగాల్సిందేనా..?

 

దేశీయంగా, సామ్‌సంగ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఫాబ్లెట్ గెలాక్సీ నోట్2ను గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ధర రూ.39,990. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతాజ్ ఆలీ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి గెలాక్సీ నోట్2 సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఇంకా ఇతర రిటైల్ పార్టనర్‌ల వద్ద లభ్యంకానుంది. వాయిదాల పద్ధతిలో సైతం నోట్2ను సొంతం చేసుకునే అవకాశాన్ని పలు ఆన్‌లైన్ స్టోర్‌లు కల్పిస్తున్నాయి.

సామ్‌సంగ్, ఆపిల్ మధ్య పోటీ వాతావరణం నెలకున్ననేపధ్యంలో గెలాక్సీ నోట్2కు, ఆపిల్ ఐఫోన్5 నుంచి ప్రతిఘటన ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టంబర్ 21 నుంచి యూఎస్, యూకే మార్కెట్లలో లభ్యమవుతున్న ఆపిల్ ఐఫోన్ 5 ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. గ్రే మార్కెట్లో ఈ డివైజ్ లభ్యమవుతున్నప్పటికి ధర చక్కులను తాకింది. అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యత్నంలో ఉన్న పలువురు ఈ రెండు గ్యాడ్జెట్‌లలో ఏది ఎంపిక చేసుకోవాలన్న విషయమై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. గెలాక్సీ నోట్ 2 అదేవిధంగా ఆపిల్ ఐఫోనో 5.. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన ఎంపిక..? ఈ అంశం పై యూజర్‌కు ఓ అవగాహన కలగించాలనే దృక్పధంతో సదరు గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌ల మధ్య విశ్లేషణ.....

బరువు ఇంకా చుట్టుకొలత:

గెలాక్సీ నోట్ 2: శరీర పరిమాణం 151.1 x 80.5 x 9.4 మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు,

ఆపిల్ ఐఫోన్5: శరీర పరిమాణం 123.8 x 58.6 x 7.6మిల్లీమీటర్లు, బరువు 112 గ్రాములు.

డిస్‌ప్లే:

గెలాక్సీ నోట్ 2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్టైలస్ పెన్ సపోర్ట్,

ఆపిల్ ఐఫోన్5: 4 అంగుళాల ఐపీఎస్ బ్యాక్ లిట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.

ప్రాసెసర్:

గెలాక్సీ నోట్ 2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

ఆపిల్ ఐఫోన్5: ఆపిల్ ఏ6 చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ నోట్ 2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆపిల్ ఐఫోన్5: ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాస్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ ఇంకా స్మైట్ డిటెక్షన్, ఇమేజ్ స్టెబిలైజేషన్, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఐఫోన్ 5: : 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాస్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ ఇంకా స్మైట్ డిటెక్షన్, ఇమేజ్ స్టెబిలైజేషన్), ఐసైట్ ఫీచర్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

స్టోరేజ్:

గెలాక్సీ నోట్2: 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ వేరియంట్స్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

ఐఫోన్ 5: 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ వేరియంట్స్, 1జీబి ర్యామ్,

కనెక్టువిటీ:

గెలాక్సీ నోట్2: హెచ్‌ఎస్‌డిపిఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, ఎల్‌టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ అండ్ ఈడీఆర్, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0,

ఐఫోన్ 5: ఐఫోన్5 కనెక్టువిటీ ఫీచర్లు- డీసీ – హెచ్‌ఎస్‌డీపీఏ 42 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపిఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, వై-ఫై ప్లస్ సెల్యులర్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

గెలాక్సీ నోట్ 2: 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఐఫోన్ 5: Li-Po బ్యాటరీ (స్టాండ్ బై 225 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు),

తీర్పు:

అధిక ముగింపు డివైజులైన గెలాక్సీ నోట్2- ఐఫోన్‌5లు ఆకట్టకునే స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. ఐఫోన్5లో ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ ఛార్జింగ్, రెటీనా డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు లోపించాయి. గెలాక్సీ నోట్2తో పోలిస్తే ఐఫోన్5 మరింత నాజూకైన స్వభావాన్ని కలిగి తక్కువ బరువుతో డిజైన్ కాబడింది. ఇతర అంశాలలో గెలాక్సీ నోట్ 2 ముందంజలో ఉంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot