సెప్టంబర్ టెన్షన్, ఎవరు హిట్టో.. ఎవరు ఫట్టో!

Posted By: Staff

సెప్టంబర్ టెన్షన్, ఎవరు హిట్టో.. ఎవరు ఫట్టో!

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌కు సక్సెసర్‌గా వస్తున్న గెలక్సీ నోట్ 2 (ఫాబ్లెట్)ను సెప్టంబర్‌లో విడుదల చేసుందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించింన సమాచారం ప్రకారం ఈ డివైజ్‌ను అక్టోబర్‌లో ఆవిష్కరించాల్సి ఉంది. అయితే, ఆపిల్ ఐఫోన్5ను సెప్టంబర్‌లో ఆవిష్కరిస్తున్న నేపధ్యంలో అందుకు పోటీగా గెలక్సీ నోట్ 2ను రంగంలోకి దింపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

గెలాక్సీ నోట్ 2 .. 5.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్‌ను కలిగి ఉంటుందని ‘జీఎస్ఎమ్ యరీనా’ ప్రకటించింది. గెలాక్సీ ఎస్3ని స్పూర్తిగా తీసుకుని ఫాబ్లెట్‌ను డిజైన్ విశ్లేషణలు ఊదరగొడుతున్నాయి. డివైజ్‌కు సంబంధించి పలు స్పెసిఫికేషన్‌ల ప్రచారంలో ఉన్నప్పటికి వాటికి సామ్‌సంగ్ వర్గాలు అధికారలు ధృవీకరించాల్సి ఉంది...

8 మెగా పిక్సల్ కెమెరా,

2జీబి ర్యామ్,

Exynos 5250 చిప్‌సెట్,

డ్యూయల్ కోర్ ఆర్మ్ 15 ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot