ముచ్చటగా మూడో పుకార్... అంతా గందరగోళం?

Posted By:

ముచ్చటగా మూడో  పుకార్... అంతా గందరగోళం?

మెగా‌బ్రాండ్ సామ్‌సంగ్, గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా రూపొందిస్తున్న ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 2’కు సంబంధించి రోజుకో కొత్త సమాచారం వెలుగులోకి వస్తుంది. ఈ డివైజ్ కెమెరా స్పెసిఫికేషన్‌కు సంబంధించి గతంలో విడుదలైన సమాచారం, తాజాగా విడుదలైన నివేదికలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇదివరుకు విడుదలైన నివేదికలలో కెమెరా స్పెసిఫికేషన్ 8 నుంచి 12 మెగాపిక్సల్ లోపు ఉండొచ్చని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన నివేదికలు ‘గెలాక్సీ నోట్ 2’ 13 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.

కాగా, గెలాక్సీ నోట్ 2 డిస్‌ప్లే పరిమాణం 5.5 అంగుళాలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా డివైజ్ రన్ అవుతుంది. తాజాగా విడుదలైన నివేదికలను బట్టి చూస్తే గెలాక్సీ నోట్ 2ను ఆగష్టులో నిర్విహించే ‘IFA 2012’ సదస్సులో ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఈ సమాచారాన్ని సామ్‌సంగ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting