మెగా ఫ్యామిలీ పై మరో పుకారు..?

Posted By: Prashanth

మెగా ఫ్యామిలీ పై మరో పుకారు..?

 

గ్యాడ్జెట్ పరిశ్రమలో మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ నిత్యం వార్తలో నిలుస్తోంది. నిన్న మొన్నటి వరకు గెలాక్సీ ఎస్3 పై విరుచుకుపడ్డ రూమర్లు తాజాగా గెలాక్సీ నోట్ ఫాబ్లెట్‌కు అపడేటెడ్ వర్షన్‌గా ఈ అక్టోబర్‌లో విడుదల కాబోతున్న ‘గెలాక్సీ నోట్ 2’ పై విజృంభిస్తున్నాయి. కొరియాకు చెందిన ఓ ఆన్‌లైన్ న్యూస్ పేపర్ ‘గెలాక్సీ నోట్ 2’కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. వీటిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆన్‌లైన్ పోర్టల్ సూచించిన మేరకు డివైజ్ ఫీచర్లు...

12 మెగా పిక్సల్ కెమెరా,

5.4 అంగుళాల flexible OLED స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

ధర ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను ఈ వెబ్ పబ్లికేషన్ పేర్కొనలేదు.

గెలాక్సీ నోట్ 2కు సంబంధించి గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న రూమర్లను పరిగణంలోకి తీసుకుంటే. ఈ ఫాబ్లెట్ 8 మెగా పిక్సల్ కెమెరా ఇంకా 5.5 అంగుళాల ఫ్లెక్సిబుల్ వోఎల్ఈడి స్ర్కీన్ కలిగి ఉంటుందని పలు నివేదికలు ఉటంకించాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పీచర్లు:

* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ – ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot