ఆ మెగా హిరో డబల్ రోల్ ... త్వరలో!

Posted By: Super

 ఆ మెగా హిరో డబల్ రోల్ ... త్వరలో!

మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తర్వలో గెలాక్సీ నోట్ 2 డ్యూయల్ సిమ్ వర్షన్‌ను అందుబాటులోకి తేనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా డిజైన్ కాబడిన గెలాక్సీ నోట్ 2ను ఇటీవల నిర్విహించిన ఐఎఫ్ఏ-2102 గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 డ్యూయల్ సిమ్ వర్షన్ త్వరలో అందుబాటులోకి రానుందన్న ఓ అనధికారిక నివేదికల ద్వారా బహిర్గతమైంది. డ్యూయల్ సిమ్ వర్షన్‌ను తొలిగా చైనా యునికామ్ ద్వారా ఆ దేశీయ మార్కెట్లో విక్రయిస్తారని బహర్గతమైన నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ఈ రిపోర్ట్‌లతో పాటు లీకైన గెలాక్సీ నోట్ 2 డ్యూయల్ సిమ్ వర్షన్ ఫోటోలో మూడు కార్డ్ల్ స్లాట్‌లను గమనించవచ్చు. వీటీలో ఒకటి మైక్రోఎస్డీ కార్ల్‌స్లాట్ కాగా, మరొకటి రెగ్యులర్ సిమ్‌కార్డ్ స్లాట్. అదనంగా మరో మైక్రో‌సిమ్ కార్డ్‌స్లాట్‌ను చిత్రంలో చూడొచ్చు.

గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:

గెలాక్సీ నోట్ 2 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే ఎస్-పెన్ సపోర్ట్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సెప్టంబర్ 22న గెలాక్సీ నోట్ 2ను విడుదల చేస్తారు. భారత్‌లో వీటి విక్రయాలు 24 లేదా 25 నుంచి ప్రారంభమవుతాయి. గ్రే ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో గెలాక్సీ నోట్ 2 ఫాబ్లెట్ లభ్యంకానుంది. త్వరలో బ్రౌన్ కలర్ వర్షన్ కూడా లభ్యమవుతుంది.

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) గెలాక్సీ నోట్2కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ధర రూ. 38,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot