కింగ్ ఎవరు..?

Posted By: Prashanth

కింగ్ ఎవరు..?

 

టెక్నాలజీ విభాగంలో దిగ్గజ శ్రేణులైన సామ్‌సంగ్, అసస్‌లు ఈ ఏడాది తమ సత్తాను చాటుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ షేర్‌ను కొల్లగొట్టిన సామ్‌సంగ్, ఆపిల్‌ను అధికమించగా అసస్ తన గూగుల్ బ్రాండెడ్ నెక్సస్ 7 టాబ్లెట్‌తో విశ్లేషకులను మెప్పించగలిగింది. తాజాగా ఈ రెండు బ్రాండ్‌ల నుంచి విడుదలైన అసస్ ప్యాడ్ ఫోన్2, గెలాక్సీ నోట్2 హైబ్రీడ్ డివైజ్‌లు మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠరేపుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య తులనాత్మక అంచనా.....

బరువు ఇంచా చుట్టుకొలత:

గెలాక్సీ నోట్2: చట్టుకొలత 151.1 x 80.5 x 9.4మిల్లీమీటర్లు, బరువు 180 గ్రాములు,

అసస్ ప్యాడ్ ఫోన్2: వివరాలు తెలియాల్సి ఉంది,

డిస్‌ప్లే:

గెలాక్సీ నోట్2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్)

అసస్ ప్యాడ్ ఫోన్2: 4.7 అంగుళా సూపర్ ఐపీఎస్+ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఎస్-పెన్ సపోర్ట్, రబ్బర్ టిప్, మెరుగైన టచ్ స్పందన,

ప్రాసెసర్:

గెలాక్సీ నోట్2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

అసస్ ప్యాడ్ ఫోన్2: క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ నోట్2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, అసస్ ప్యాడ్ ఫోన్2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,(ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, బై-డైరెక్షనల్ టెక్స్ట్ సపోర్ట్, లాంగ్వేజ్ సపోర్ట్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, ప్రత్యక్ష వాల్ పేపర్, హై రిసల్యూషన్ కాంటాక్ట్ చిత్రాలు, ఆండ్రాయిడ్ బీమ్, మెరుగైన వై-ఫై నెట్ వర్క్)

కెమెరా:

గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకనేందుకు),

అసస్ ప్యాడ్ ఫోన్2: 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్:

గెలాక్సీ నోట్2: ఇంటర్నల్ మెమరీ వర్షన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

అసస్ ప్యాడ్ ఫోన్2: ఇంటర్నల్ మెమరీ వర్షన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

గెలాక్సీ నోట్2: 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

అసస్ ప్యాడ్ ఫోన్2: 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

బ్యాటరీ:

గెలాక్సీ నోట్2: 3100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

అసస్ ప్యాడ్ ఫోన్2: 2140ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

గెలాక్సీ నోట్2: రూ.39,990,

అసస్ ప్యాడ్ ఫోన్2: రూ.64,999.

ప్రీలోడెడ్ అప్లికేషన్స్:

గెలాక్సీ నోట్2: ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, స్మార్ట్‌స్టే, ఎస్ బీమ్, పాప్‌అప్‌ప్లే.

అసస్ ప్యాడ్ ఫోన్2: ప్యాడ్ ఫోన్ స్టేషన్ (10.1 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరువు 514 గ్రాములు, 13-పిన్ కనెక్టర్ పోర్ట్),

తీర్పు:

పెద్దదైన డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ జెల్లీబీన్, స్టైలస్ సపోర్ట్, మన్నికైన బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి గెలాక్సీ నోట్2 ఉత్తమ ఎంపిక. స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ అనుభూతులను కోరుకునే వారికి అసస్ ప్యాడ్ ఫోన్2 బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot