మెగా ఫ్యామిలీలో ‘వార్’..?

Posted By: Staff

మెగా ఫ్యామిలీలో ‘వార్’..?

గ్యాడ్జెట్ నిర్మాణ రంగంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ మెగాఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఇంకా విండోస్ ఆధారిత డివైజ్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తూ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన స్థానాన్సి సుస్ధిరం చేసుకుంది. బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ-2012 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా సామ్‌సంగ్ రేపటితరం ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్ 2’ను ఆవిష్కరించింది. ఇదే వేదిక పై విండోస్ 8 ప్లాట్‌ఫామ్ పై స్పందించే టాబ్లెట్(ఏటీఐవీ) అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ (ఏటీఐవీ ఎస్) మరో గెలాక్సీ కెమెరాను బ్రాండ్ విడుదల చేసింది. ఇంచు మించు గెలాక్సీ ఎస్3 పోలికలతో డిజైన్ కాబడిన నోట్ 2 ఫీచర్ల విషయంలోనూ అదే పంధాను కొనసాగించటంతో రెండు గ్యాడ్జెట్‌ల మధ్య పోటీవాతావరణం నెలకుంది. మే3న లండన్‌లో విడుదలైన సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3 రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్లు అమ్ముడుపోయింది. ఇతే తరహాలో వస్తున్న గెలాక్సీ నోట్-2, ఎస్ 3 అమ్మకాలను అధిగమిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ రెండు డివైజుల మధ్య వృత్యాసం క్లుప్తంగా...

బరువు, చుట్టుకొలతలు:

180 గ్రాముల బరువు కలిగిన గెలాక్సీ నోట్ 2, 151,1 x 80.5 x 9.4 మి.మీ చుట్టుకొలతను కలిగి ఉంటుంది. 133గ్రాముల బరువుతో రూపాంతరం చెందిన గెలాక్సీ ఎస్3 136.6 x 70.6 x 8.6మి.మీ పరిమాణాన్ని నమోదు చేసింది.

డిస్‌ప్లే, రిసల్యూషన్:

డిస్‌ప్లే విషయానికొస్తే నోట్ 2, 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకా ఎస్-పెన్ స్టైలస్. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్. గెలాక్సీ ఎస్3, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్.

ప్రాసెసర్: ఈ రెండు డివైజుల్లో క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్‌తో పాటు సామ్‌సంగ్ Exynos 4412క్వాడ్ చిప్‌సెట్ ఇంకా మాలీ 400మెగాపిక్సల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను నిక్షిప్తం చేశారు. ప్రాసెసర్ క్లాక్ వేగాన్ని పరిశీలిస్తే నోట్‌లో నిక్షిప్తం చేసిన ప్రాసెసర్ 1.6గిగాహెర్జ్ క్లాక్ వేగాన్ని కలిగి ఉండగా,ఎస్3లో నిక్షిప్తం చేసిన ప్రాసెసర్ 1.4గిగాహెర్జ్ వేగాన్ని కలిగి ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ నోట్ 2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ ఎస్ 3: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్).

సాఫ్ట్‌వేర్ ఫీచర్లు:

ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, స్మార్ట్ స్టే, ఎస్‌బీమ్, పాప్-అప్ ప్లే వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఈ రెండు గ్యాడ్జెట్‌లలో నిక్షిప్తం చేశారు.

కెమెరా:

గెలాక్నీ నోట్ 2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ అండ్ స్మైల్ డిటెక్షన్, ఇమేజ్ స్టెబిలైజేషన్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

గెలాక్సీ ఎస్ 3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ అండ్ స్మైల్ డిటెక్షన్, ఇమేజ్ స్టెబిలైజేషన్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్:

నోట్ 2 ఇంకా ఎస్‌3లు 16, 32, 64జీబి స్టోరేజ్ మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా నోట్ 2 మెమరీని 32జీబి పొడిగించుకోవచ్చు. ఎస్3 మెమరీని 64జీబికి పొడిగించుకోవచ్చు.

కనెక్టువిటీ:

హెచ్‌ఎస్‌డిపిఏ 21ఎంబీపీఎస్, హెచ్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, ఎల్‌టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ అండ్ ఈడీఆర్, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ రెండు పరికరాల్లో ఉన్నాయి.

బ్యాటరీ:

నోట్ 2 పెద్దదైన 3,100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీని అమర్చారు. ఎస్3లో 2,100ఎమ్ఏహెచ్ సామర్ద్యం గల బ్యాటరీని లోడ్ చేసారు (టాక్ టైమ్ 11.5 గంటలు, స్టాండ్ బై టైమ్ 790 గంటలు).

ధర: గెలాక్సీ నోట్ 2 ధర తెలియాల్సి ఉండగా, గెలాక్సీ ఎస్3 16జీబి వర్షన్ ధర రూ.37,990 కాగా 32జీబి వర్షన్ ధర రూ.40,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot