మాయా బజార్..ఇక్కడ స్మార్ట్‌ఫోన్‌లు సగం ధరకే?

పండుగ సీజన్‌ను పురస్కరించుకని ఆన్‌లైన్ రిటైలర్లు టెక్నాలజీ ఉత్పత్తుల కొనుగోళ్ల పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్న నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ కౌన్సా డాట్ కామ్(Kaunsa.com), ఆపిల్, సామ్‌సంగ్ గ్యాడ్జెట్‌ల పై అద్భుతమైన డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. ఓరిజనల్ మార్కెట్లో రూ.35,499 పలుకుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను ఈ రిటైలర్ రూ.29,999కే ఆఫర్ చేస్తోంది. ఈ రిటైలర్ వద్ద గెలాక్సీ నోట్ 2 ధర రూ.14,999. ఓరిజనల మార్కెట్ ధర రూ.37,000. ఇంత తక్కువేంటని షాక్ అవుతున్నారా?. ఇందులో పెద్ద మతలబే ఉందడోయ్! తగ్డింపు ధరల్లో ఈ సైట్ ఆఫర్ చేస్తున్న గ్యాడ్జెట్‌లు వాస్తవానికి ఓరిజనల్‌వి కావు పూర్తిగా ‘క్లోన్’ చేయబడినవి. చైనా కెంపెనీలు వీటి అచ్చుగుద్దినట్లు డిజైన్ చేసాయి.
క్లోన్ చేయబడని గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు:
5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (3జీ ఇంటిగ్రేషన్),
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ఎస్-పెన్,
(లోపించిన ఫీచర్లు: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ), సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు).


Click it and Unblock the Notifications







