సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో ఆవిష్కరణ

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌స్ంగ్ తన సరికొత్త ఫాబ్లెట్ వర్షన్ ‘గెలాక్సీ నోట్ 3 నియో'ను ఆవిష్కరించినట్లు సామ్‌సంగ్ పోలాండ్ ధృవీకరించింది. డివైస్‌కు సంబంధించిన ధరల వివరాలు వెల్లడికాలేదు. ఈ ఫాబ్లెట్ 3జీ ఇంకా ఎల్టీఈ మోడల్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. సామ్‌సంగ్ పోలాండ్ వెల్లడించిన వివరాల మేరకు అంతర్జాతీయ మార్కెట్లో గెలాక్సీ నోట్ 3 నియోను ఈ ఫిబ్రవరిలో విడుదల చేస్తారు.

 సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో ఆవిష్కరణ

బ్లాక్ర్, గ్రీన్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ పెద్దతెర హైబ్రీడ్ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎస్ పెన్ ఫీచర్‌తో గెలాక్సీ నోట్ 3 నియో లభ్యమవుతుంది. 3జీ వేరియంట్‌లో 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసారు. ఎల్టీఈ వేరియంట్‌లో 1.7గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ15 + 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 హెక్సా- కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ పై స్పందిస్తాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 నియో కీలక స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, 3జీ, జీపీఎస్ కనెక్టువిటీ, గ్లోనాస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot