సామ్‌సంగ్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

Posted By:

సామ్‌సంగ్ ఫోరమ్ 2014 వేదికగా సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన నియో సిరీస్ నుంచి పలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఓ ట్యాబ్లెట్ డివైస్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ డివైస్‌లలో ఒకటైన గెలాక్సీ నోట్ 3 నియో రూ.38,990 ధర ట్యాగ్‌తో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ డివైస్‌ను రూ.5,000 ధర తగ్గింపు పై రూ.35,990కి ఆఫర్ చేస్తున్నారు.

సామ్‌సంగ్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు!

ఈ హెక్సా‌కోర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్.

డివైస్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 148.4 x 77.4 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 162.5 గ్రాములు. 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా విస్తరించుకునేసౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్ సౌలభ్యతతో). ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు).

రెండు 1.7గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ15 కోర్ ప్రాసెసర్‌లతో పాటు నాలుగు 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్లతో కూడిన హెక్సాకోర్ చిప్‌‍సెట్‌ను డివైస్‌లో నిక్షిప్తం చేసారు. తద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్ సాధ్యమవుతుంది. 3100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని డివైస్‌లో దోహదం చేసారు.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot