గెలాక్సీ నోట్3.. త్వరలో!

Posted By: Prashanth

గెలాక్సీ నోట్3.. త్వరలో!

 

గెలాక్సీ నోట్2కు సక్సెసర్ వర్సన్‌గా గెలాక్సీ నోట్3ని అందుబాటులోకి తేనున్నట్లు సామ్‌సంగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కొత్త వర్షన్ డివైజ్ 6.3 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి స్మార్ట్‌ఫోన్ అలానే టాబ్లెట్ అవసరాలను తీరుస్తుందని కంపెనీ తెలిపింది. మరోవైపు సోనీ, సామ్‌సంగ్ గెలాక్నీ నోట్3కి పోటీగా ‘ఎక్ప్‌పీరియా 6’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సామ్‌సంగ్ సోనీల మధ్య పోరు రసవత్తరం కానుంది. గెలాక్సీ నోట్ 3 ఆవిష్కరణకు సంబంధించి పరిశ్రమలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను జనవరిలో నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతుండగా మరొకొందరు మాత్రం ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో నోట్ 3 ఆవిష్కరణ ఉంటుందని ధృడనిశ్చయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికి గెలాక్సీ నోట్ 3 అధికారిక ఆవిష్కరణకు సంబంధించి సామ్‌సంగ్ నోరు మెదపాల్సి ఉంది.

భారీ అంచనాలతో ముస్తాబవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అనధికారిక స్పెసిఫికేషన్‌లను ఇప్పుడు చూద్దాం....

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

కుర్ర కుబేరులు… (ఫోటో గ్యాలరీ)!

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting