మెగా అభిమానులూ.. పండగ చేసుకోండి!

Posted By: Prashanth

మెగా అభిమానులూ.. పండగ చేసుకోండి!

 

న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతున్న సామ్‌సంగ్ అభిమానులకు మరో ఖుషి ఖుషి వార్త వెబ్ ప్రపంచంలో సందడి చేస్తోంది. మెగాఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త గాడ్జెట్ 2013లో ఆవిష్కరణకు నోచుకోనుంది. వివరాల్లోకి వెళితే.... సామ్‌సంగ్ రెండవ తరం ఫాబ్లెట్ ‘గెలాక్సీ నోట్2’కు సక్సెసర్ వర్షన్‌గా ‘గెలాక్సీ నోట్3’ని సామ్‌సంగ్ కొత్త ఏడాదిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ డివైస్‌కు సంబంధించిన డిస్‌ప్లేను వచ్చే జనవరిలో నిర్వహించే ‘సీఈఎస్ 2013’ వేదిక పై ఆవిష్కరించేందుకు సౌత్ కొరియన్ దిగ్గజం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వాల్ పేపర్లు (కెవ్వు...కేక)

కళ్లు చెదిరే ‘సిత్రాలు’

అనధికారిక నివేదికలు మేరకు గెలాక్సీ నోట్3 ఫీచర్లు:

6.3 అంగుళాల స్ర్కీన్,

పెద్దదైన బ్యాటరీ,

ఆండ్రాయిడ్ 5.5 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,

16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),

3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమరీ పాయింట్స్ (32జీబి, 64జీబి, 128జీబి),

3జీబి ర్యామ్,

4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ఫాబ్లెట్ బరువు 220 గ్రాములు,

చుట్టుకొలత 84.9 x 161.9 x 8.9మిల్లీ మీటర్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot