గెలాక్సీ నోట్ 4ను ప్రదర్శించిన సామ్‌సంగ్

|

అభిమానుల అంచనాలను నిజం చేస్తూ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్, బుధవారం ర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఎ-2014 ప్రీ ఈవెంట్‌లో గెలాక్సీ నోట్ 4 ఫాబ్లెట్‌తో పాటు వొంపు తిరిగిన డిస్‌ప్లేను కలిగి ఉన్నస్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ నోట్ 3కి అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ నోట్ 4ను పంచవ్యాప్తంగా అక్టోబర్‌ నుంచి విక్రయించేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తోంది. మరో ఫోన్ గెలాక్సీ నోట్ ఎడ్జ్‌ను ఈ ఏడాది ఆఖరిలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయించనున్నారు. ఇదే కార్యక్రమంలో గెలాక్సీ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్‌తో పాటు వర్చువల్ రియాలిటీ అనుభవాలను అందించే సామ్‌సంగ్ గేర్ వీఆర్ హెడ్‌సెట్‌ను కంపెనీ ప్రదర్శించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 515 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్),2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లేదా 1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ (దేశాన్ని బట్టి ఈ వేరియంట్ మారుతుంది), అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా మాలీ - టీ760 గ్రాఫిక్ యూనిట్ (దేశాన్ని బట్టి ఈ వేరియంట్ మారుతుంది), 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), నిక్షిప్తం చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం), 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, ఎ- జీపీఎస్), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

8.5 మిల్లీమీటర్ల మందంతో 176 గ్రాముల బరువుండే గెలాక్సీ నోట్ 4లో ఎస్-పెన్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

సామ్‌సంగ్  గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్ కొసం గెలాక్సీ నోట్ 4లో ఎస్ పెన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసారు. ఎస్ పెన్‌లోని ఎయిర్ కమాండ్, యాక్షన్ మెమో, స్ర్కీన్ రైట్, ఇమేజ్ క్లిక్, స్మార్ట్ సెలక్ట్ వంటి  ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

 

సామ్‌సంగ్  గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ శక్తివంతమైన కెమెరా ద్వారా 4కే అల్ట్రా హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 3.7 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్ ద్వారా అత్యుత్తమ వీడియో కాలింగ్ తో పాటు నాణ్యమైన సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

సామ్‌సంగ్  గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

8.5 మిల్లీమీటర్ల మందంతో 176 గ్రాముల బరువుండే గెలాక్సీ నోట్ 4లో ఎస్-పెన్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

 

సామ్‌సంగ్  గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ప్రత్యేకతలు

"Charcoal Black," "Frost White," "Bronze Gold," కలర్ వేరియంట్ లలో గెలాక్సీ నోట్ 4. అక్టోబర్ 2014 నుంచి లభ్యం కానుంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X