సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 వచ్చేసింది, 10 ప్రత్యేకతలు

భారీ అంచనాల మధ్య సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది గంటల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కొలో లాంచ్ చేసింది. విప్లవాత్మక ఎస్ పెన్ సౌలభ్యతతో ఆవిష్కరించబడిన ఈ ప్లాగ్‌షిప్ ఫాబ్లెట్ ఆగష్టు 11న ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశముంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 వచ్చేసింది, 10 ప్రత్యేకతలు

Read More : సామ్‌సంగ్, మోటరోలా ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

5 అడుగుల లోతైన నీటిలో 30 నిమిషాల పాటు తట్టుకోగలిగే ఐపీ68 సర్టిఫికేషన్ వాటర్ రెసిస్టెంట్ బాడీ వ్యవస్థను ఈ డివైస్ కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో పొందుపరిచిన ఐరిస్ స్కానింగ్ సపోర్ట్, హెచ్‌డీఆర్ వీడియో స్ట్రీమింగ్ వంటి ఆధునాత ఫీచర్లు గెలాక్సీ నోట్ 7ను విప్లవాత్మకంగా తీర్చిదిద్దాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 వచ్చేసింది, 10 ప్రత్యేకతలు

Read More : వామ్మో... ఈ ఫోన్ డిస్‌ప్లే 6.6 అంగుళాలు

5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లేతో వస్తోన్న గెలాక్సీ నోట్ 7..Gear VR వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లే

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ 5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లేతో వస్తోంది. డిస్‍‌ప్లే రిసల్యూషన్ పరిశీలించినట్లయితే.. 2560 x 1440పిక్సల్స్. డ్యుయల్ ఎడ్జ్ కర్వుడ్ స్ర్కీన్ ఆకట్టుకుంటుంది. ఫోన్ డిస్‍‌ప్లేకు రక్షణ కవచంలా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను ఏర్పాటు చేసారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 సీపీయూ

హార్డ్‌వేర్ పరంగా గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఆక్టాకోర్ 64 బిట్ ఎక్సినోస్ 8890 లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్. ర్యామ్ విషయానికి వచ్చే సరికి 4జీబి లేదా 6జీబి.

 

ఇంటర్నల్ స్టోరేజ్

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా విషయానికి వచ్చే సరికి

కెమెరా విషయానికి వచ్చే సరికి గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి.

ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే Android 7.0 అప్‌డేట్ పొందే అవకాశం.

ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ

ఈ డివైస్‌లో బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐరిస్ స్కానర్ వ్యవస్థను పొందుపరిచారు. ఈ ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ పోన్ కు హై సెక్యూరిటీని అందిస్తుంది. ప్రభుత్వ సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలను ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చని సామ్‌సంగ్ చెబుతోంది.

యూఎస్బీ టైప్ సీ

సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో విప్లవాత్మక యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌ను నిక్షప్తం చేసింది. ఈ పోర్ట్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్‌తో పాటు డేటా ట్రాన్స్‌ఫర్‌ను పొందవచ్చు.

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. పోన్‌లో ఏర్పాటు చేసిన ఈజీ పవర్ మేనేజ్‌మెంట్ యూఎక్స్ సిస్టం బ్యాటరీ శక్తిని పొదుపుగా వాడుకునేలా చూస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు క్విక్‌ఛార్జ్ ఫీచర్లను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది.

స్టైలస్ ఎస్ 7 సపోర్ట్

అప్‌‍గ్రేడెడ్ ఫీచర్లతో సామ్‌సంగ్ అభివృద్థి చేసిన స్టైలస్ ఎస్ 7, గెలాక్సీ నోట్ 7 యూజర్లకు రియల్ టైమ్ అనుభూతులతో సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువ చేస్తుంది. నీటిలోని ఈ పెన్ పనిచేస్తుంది.

ఉచిత క్లౌడ్ స్టోరేజ్

గెలాక్సీ నోట్ 7 యూజర్లకు 15జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్‌ను సామ్‌సంగ్ ఆఫర్ చేస్తోంది.

ఇతర కనెక్టువిటీ ఫీచర్లు

గెలాక్సీ నోట్ 7 కనెక్టువిటీ ఫీచర్లు హార్ట్‌రేట్ సెన్సార్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, బారో మీట‌ర్ 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 7 Now Official! 10 Things to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot