సగం ధరకే సామ్‌సంగ్ ప్రీిమియమ్ స్మార్ట్‌ఫోన్

రూ.28,300కే Galaxy Note 7...

|

బ్యాటరీ లోపం కారణంగా సామ్‌సంగ్‌కు భారీ నష్టాలను మిగిల్చిన గెలాక్సీ నోట్ 7 ఇప్పుడు Galaxy Note 7R పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. R అంటే Refurbished అని అర్థం. పూర్తిగా రిపేర్ చేయబడిన గెలాక్సీ నోట్ 7 యానిట్‌లను సగం ధరకే మార్కెట్లో విక్రియించేందుకు సామ్‌సంగ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More : మోటరోలా కొత్త ఫోన్లు మరో సంచలనం కాబోతోన్నాయా..?

ధర రూ.28,300గా ఉండొచ్చు..

ధర రూ.28,300గా ఉండొచ్చు..

తొలత గెలాక్సీ నోట్ 7 Refurbished మోడల్ ధరను అమెరికా కరెన్సీ ప్రకారం రూ.39,900గా ఫిక్స్ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజాగా తెలియవచ్చిన సమచారం ప్రకారం ఈ ధర రూ.28,300గా ఉండొచ్చని తెలుస్తోంది.

చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను

చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను

చిన్న చిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను తిరిగి ఆధునీకరించి సేల్ చేసే ఫోన్‌లనే Refurbished ఫోన్స్ అని అంటారు. కొత్త ఫోన్‌లతో పోలిస్తే రిఫర్బిషిడ్ ఫోన్‌లు తక్కువ ధర‌‍కే వచ్చేస్తాయి. పెర్మామెన్స్ సమస్యలు కూడా అంతగా ఉండవు. 

క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే
 

క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే

Refurbished ఫోన్‌‌లు క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే మార్కెట్లోకి వస్తాయి బట్టి వీటిలో హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే ఛాన్సే ఉండదు. వారంటీ కూడా వర్తిస్తుంది. రిఫర్బిషిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసి వాడటం మొదలు పెట్టడం ద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. తరువాత మీరు కొనుగోలు చేయబోయే కొత్త పోన్‌ను సులువుగా టాకిల్ చేయగలుగుతారు.

5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లే

5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లే

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్.. 5.7 అంగుళాల క్వాడ్ హైడెపినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‍‌ప్లేతో వస్తోంది. Gear VR వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్‍‌ప్లేకు రక్షణ కవచంలా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను ఏర్పాటు చేసారు.

 హార్డ్‌వేర్ పరంగా చూస్తే..

హార్డ్‌వేర్ పరంగా చూస్తే..

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఆక్టాకోర్ 64 బిట్ ఎక్సినోస్ 8890 లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్. ర్యామ్ విషయానికి వచ్చే సరికి 4జీబి లేదా 6జీబి.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్..

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్..

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా విషయానికి వచ్చే సరికి

కెమెరా విషయానికి వచ్చే సరికి

కెమెరా విషయానికి వచ్చే సరికి గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉంటాయి.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే Android 7.0 అప్‌డేట్ పొందే అవకాశం.

డ్యుయల్ - ఐరిస్ స్కానర్ సపోర్ట్...

డ్యుయల్ - ఐరిస్ స్కానర్ సపోర్ట్...

ఈ డివైస్‌లో బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐరిస్ స్కానర్ వ్యవస్థను పొందుపరిచారు. ఈ ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీ పోన్ కు హై సెక్యూరిటీని అందిస్తుంది. ప్రభుత్వ సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలను ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చని సామ్‌సంగ్ చెబుతోంది.

 

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. పోన్‌లో ఏర్పాటు చేసిన ఈజీ పవర్ మేనేజ్‌మెంట్ యూఎక్స్ సిస్టం బ్యాటరీ శక్తిని పొదుపుగా వాడుకునేలా చూస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు క్విక్‌ఛార్జ్ ఫీచర్లను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది.

 స్టైలస్ ఎస్ 7 సపోర్ట్

స్టైలస్ ఎస్ 7 సపోర్ట్

అప్‌‍గ్రేడెడ్ ఫీచర్లతో సామ్‌సంగ్ అభివృద్థి చేసిన స్టైలస్ ఎస్ 7, గెలాక్సీ నోట్ 7 యూజర్లకు రియల్ టైమ్ అనుభూతులతో సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువ చేస్తుంది. నీటిలోని ఈ పెన్ పనిచేస్తుంది.

గెలాక్సీ నోట్ 7 కనెక్టువిటీ ఫీచర్లు

గెలాక్సీ నోట్ 7 కనెక్టువిటీ ఫీచర్లు

 హార్ట్‌రేట్ సెన్సార్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, బారో మీట‌ర్ 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 7R Rumoured to Be Sold at Half the Price of Original. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X