గెలాక్సీ నోట్ 8 పై రూ.12,000 ధర తగ్గింపు, అదనం రూ.4000 క్యాష్‌బ్యాక్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 8 పై భారీ ధర తగ్గింపును అందుకుంది.

By GizBot Bureau
|

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 8 పై భారీ ధర తగ్గింపును అందుకుంది. ఈ ఫాబ్లెట్ డివైస్ పై ఏకంగా రూ.12,000 ధర తగ్గింపును ప్రకటిస్తూ సామ్‌సంగ్ నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపు నేపథ్యంలో రూ.67,900 ఖరీదు చేసే నోట్ 8 ఫాబ్లెట్‌ను రూ.55,900కే సొంతం చేసుకునే వీలుంటుంది.

హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే..

హెచ్‌డిఎఫ్‌సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే..

తగ్గింపు ధరతో కూడిన నోట్ 8 డివైస్‌ అమెజాన్ ఇండియాతో పాటు సామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యమవుతోంది. ఇదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫాబ్లెట్ డివైస్‌ను కొనుగోలు చేసినట్లయితే అదనంగా రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ వారికి లభిస్తుంది.

 

 

మొదటి డ్యుయల్ కెమెరా ఫోన్..

మొదటి డ్యుయల్ కెమెరా ఫోన్..

డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ నోట్ 8 గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ సెన్సార్స్ హై-క్వాలిటీ ఫోటోగ్రఫీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెండు సెన్సార్స్‌లో మొదటిది వైడ్ యాంగిల్ లెన్స్ (విత్ f/1.7 అపెర్చుర్) కాగా రెండవది టెలిఫోటో జూమ్స్ లెన్స్ (విత్ f/2.4 అపెర్చుర్).

డ్యుయల్ క్యాప్చుర్ మోడ్...

డ్యుయల్ క్యాప్చుర్ మోడ్...

ఫోన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హై-క్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ నిర్వహించుకునే వీలుంటుంది. ఫోన్ ముందు అలానే వెనుక భాగాల్లో అమర్చిన అన్ని కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ను కలిగి ఉంటాయి. డ్యుయల్ క్యాప్చుర్ మోడ్ ఈ కెమెరాలకు మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

6.3 అంగుళాల క్వాడ్ హైడెఫనిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (2960x1440 పిక్సల్స్ రిసల్యూషన్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిగ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, సామ్ సంగ్ ఎక్సినోస్ 8895 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఐరిస్ స్కానర్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 8 gets Rs 10,000 plus price cut.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X