448 జిబి జియో డేటా ఫ్రీ, భారీ ఆఫర్లతో గెలాక్సీ నోట్ 8 ఫ్రీ ఆర్డర్లు షురూ
ఆపిల్ ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు పోటాపోటీగా దూసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 భారీ ఆపర్లతో వచ్చేసింది.
ఆపిల్ ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు పోటాపోటీగా దూసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 భారీ ఆపర్లతో వచ్చేసింది. గత వారం ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్‌కు వచ్చింది.

సెప్టెంబర్ 21 వరకు ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ చేపడుతోంది. సెప్టెంబర్ 21 నుంచే శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. ప్రీ-ఆర్డర్ల సందర్భంగా గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ బంపర్ ఆఫర్లను వినియోగదారులకు ప్రకటించింది.

4000 రూపాయల క్యాష్‌బ్యాక్
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులపై 4000 రూపాయల క్యాష్‌బ్యాక్, ఉచితంగా వైర్‌లెస్ ఛార్జర్, 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, 448జీబీ రిలయన్స్ జియో డేటాను అమెజాన్ ఆఫర్ చేయనుంది.

ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ
నోట్ 8 ప్రీ-ఆర్డర్‌పై ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని కూడా అమెజాన్ అందించనుంది.

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై 1000 రూపాయల వరకు తగ్గింపు
హెచ్‌డీఎఫ్‌సీ కార్డుహోల్డర్స్‌కు రూ.4000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై 1000 రూపాయల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.


Click it and Unblock the Notifications