జీరో ఛార్జింగ్ అయితే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు ఇక పనిచేయవు !

Written By:

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ ఫోన్ చార్జింగ్ సున్నా దాకా వస్తే ఇక ఫోన్ పనిచేయదట. ఛార్జింగ్ పెట్టినా ఆన్ కాదు. వివరాల్లోకి వెళితే అమెరికాతోపాటు పలు ఇతర దేశాల యూజర్లకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అలాగే తన సొంత ఎగ్జినోస్ ప్రాసెసర్లను కలిగిన నోట్ 8 యూనిట్లను శాంసంగ్ విక్రయించింది.

కొనుగోలుదారులకు ఆఫ్‌లైన్‌‌లో షాకిస్తున్న రెడ్‌మి 5ఏ..

జీరో ఛార్జింగ్ అయితే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు ఇక పనిచేయవు !

అయితే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు కలిగిన నోట్ 8 ఫోన్లలోనే ఛార్జింగ్ సమస్య వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమస్య ఉన్న ఫోన్లను ఇప్పటికే శాంసంగ్ రిపేర్ చేసి ఇస్తుండగా, వారంటీ ఉన్నప్పటికీ రీప్లేస్‌మెంట్ కింద కొత్త ఫోన్లను మాత్రం ఇవ్వడం లేదు.

6జిబి ర్యామ్, 6080mAh బ్యాటరీ, ఫోన్ కేక బాసూ !

జీరో ఛార్జింగ్ అయితే గెలాక్సీ నోట్ 8 ఫోన్లు ఇక పనిచేయవు !

దీనికి తోడు గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్లలోనూ ఈ తరహా చార్జింగ్ సమస్యే వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్లలో చార్జింగ్ సున్నా (0) కు వస్తే ఇక ఫోన్లు ఆన్ అవ్వవు. చార్జింగ్ పెట్టినా పనిచేయవు. ఈ క్రమంలోనే అసలు ఈ సమస్య ఫోన్‌లో ఉన్న హార్డ్‌వేర్ వల్ల వచ్చిందా, లేదంటే సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమా అనే విషయాన్ని శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
Samsung Galaxy Note 8 reportedly dying once battery drains completely Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot