గెలాక్సీ నోట్ 8 ఇండియా రిలీజ్ ఎప్పుడంటే..?
అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్..
వివాదాస్పద గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా సామ్‌సంగ్ ఇటీవల అందుబాటలోకి తీసకువచ్చిన గెలాక్సీ నోట్ 8 ఇండియా రిలీజ్‌కు సంబంధించి తాజా రిపోర్ట్ ఒకటి లీక్ అయ్యింది. ఈ రిపోర్ట్ ప్రకారం గెలాక్సీ నోట్ 8 ఇండియాలో సెప్టంబర్ 25 నుంచి అందుబాటులో ఉంటుంది.

సెప్టంబర్ 11 నుంచి ప్రీ-ఆర్డర్స్
ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ సెప్టంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ ఫాబ్లట్ ధర రూ.69,900 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

అమెజాన్ ఇండియాలో విక్రయాలు..
ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ 8 అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావల్సి ఉండి. భారత్‌లో ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించే అవకాశముంది.


Click it and Unblock the Notifications