అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్, ఆ సామ్‌సంగ్ ఫోన్ పై రూ.10,000 తగ్గింపు!

By GizBot Bureau
|

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు సమయం సమీపిస్తోంది. 36 గంటల పాటు సాగే ఈ సేల్ జూలై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, ఫ్యాషన్ ఇంకా ఇతర లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల పై సంచలన ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఈ ఆఫర్లతో పాటు బ్లాక్‌బాస్టర్ వీడియో టైటిల్స్ పై బెస్ట్ డీల్స్‌ను అమెజాన్ అందించబోతోంది. అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లను యూజర్లు యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లలోనూ పొందే వీలుంటుంది.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద రూ.45,900కే సొంతం..
 

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద రూ.45,900కే సొంతం..

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను పురస్కరించుకుని సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ నోట్ 8 పై సంచలన ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులు రూ.55,900 ఖరీదు చేసే గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద రూ.45,900కే సొంతం చేసుకునే వీలుంటుంది. ఈ ఆఫర్ అమెజన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కోనుగోలు చేస్తే..

హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కోనుగోలు చేస్తే..

ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు రూ.4000 క్యాష్ బ్యాక్‌తో పాటు తొమ్మిది నెలల వాయిదాతో కూడిన ‘నో కాస్ట్ ఈఎమ్ఐ' సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

6.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440 x 2960 పిక్సల్స్) విత్ 18.5.9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ఎక్సినోస్ 8895 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సంచలన ఫీచర్లతో గెలాక్సీ నోట్ 9
 

సంచలన ఫీచర్లతో గెలాక్సీ నోట్ 9

స్మార్ట్‌ఫోన్ల రారాజుగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న సామ్‌సంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో తీసుకొచ్చిన గెలాక్సీ నోట్‌ 8కు సక్ససర్‌గా దీన్ని తీసుకురాబోతున్నట్టు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ బెంచ్‌మార్కింగ్‌ సైట్‌ గీక్‌బెంచ్‌, తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన చేసిన కథనం ప్రకారం సామ్‌సంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 9ను జూలై నెలలో విడుదల చేసే అవకాశముందని తెలిపింది. తాజా లీక్స్ ప్రకారం గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon is all geared up to kickstart its Prime Day sale from Tomorrow. The company will organise a 36 hours sale in which the company will have offers on wide range of products including smartphones. One such offer is on the flagship smartphone from Samsung -- Galaxy Note 8. The device is presently available at Rs 55,900 on Amazon. Now the e-commerce major has posted that will be giving an exchange offer of up to Rs 10,000 on the device during the Prime Day sale bringing down the price to 45,900.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X