సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 లాంచ్ అయ్యింది

గెలాక్సీ నోట్ 7 తరువాతి మోడల్ అయిన గెలాక్సీ నోట్ 8ను దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ ఆవిష్కరించింది. న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

సాయంత్రం 5 గంటల నుంచి జియోఫోన్ బుకింగ్స్ ప్రారంభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి

యూఎస్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టంబర్ 15 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. ధర $930 (ఇండియన్ కరెన్సీలో రూ.59,500).

Gear 360 కెమెరా ఉచితం..

ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకున్న వారికి Gear 360 కెమెరాను సామ్‌సంగ్ ఉచితంగా ఇవ్వనుంది.

అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్..

ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ నోట్ 8 అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉండి. భారత్‌లో ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించే అవకాశముంది.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..

6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 8 With 6.3-Inch AMOLED Display Launched. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot