రూ.7900 చెల్లిస్తే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 మీ సొంతమవుతుంది !

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను ఇటీవలే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను ఇటీవలే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ ఈ నెల 21వ తేదీ నుంచి విక్రయానికి రానుంది. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికోసం Airtel రూ. 7900 డౌన్ పేమెంట్‌తో గెలాక్సీ నోట్ 9ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే కొన్ని పరిమితులను విధించినట్లుగా తెలుస్తోంది.
ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.67,900 ఉండగా, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.84,900 గా ఉంది. అయితే గెలాక్సీ నోట్ 9కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ను మాత్రమే ఎయిర్‌టెల్ రూ.7,900 డౌన్ పేమెంట్‌తో వినియోగదారులకు అందిస్తున్నది.

 

తక్కువ ధరకే Smart LED TV, మరో చైనా కంపెనీ సంచలనంతక్కువ ధరకే Smart LED TV, మరో చైనా కంపెనీ సంచలనం

 రూ.7,900 డౌన్ పేమెంట్

రూ.7,900 డౌన్ పేమెంట్

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.7,900 డౌన్ పేమెంట్ చేస్తే కస్టమర్లకు 24 నెలల ఈఎంఐతో గెలాక్సీ నోట్ 9 లభిస్తుంది. ఆ తరువాత ప్రతీ నెల కస్టమర్లు 24 నెలల పాటు నెలకు రూ.2,999 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఫోన్ ధర

ఫోన్ ధర

ఈ రెండు సంవత్సరాలకు కొనుగోలుదారులు మొత్తం రూ.71,976 చెల్లించాలి. దీనికి డౌప్ పేమెంట్ కూడా కలుపుకుంటే ఫోన్ ధర రూ. 79,876గా అవుతుంది. ఫోన్ కొనుగోలు ధర కన్నా అదనంగా మీరు రూ. 11,976 చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్

అయితే పోన్ కొనుగోలుదారులు తప్పనిసరిగా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వాడాల్సి ఉంటుంది. ఫోన్ కొనుగోలు సమయంలోనే దీన్ని వారికి అందిస్తారు.

నెలకు 100 జీబీ డేటా
 

నెలకు 100 జీబీ డేటా

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు నెలకు 100 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఉచిత మెంబర్‌షిప్, ఉచిత ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో

గెలాక్సీ నోట్ 9 ఫోన్‌ను కస్టమర్లు ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ముందుగానే తీసుకునేలా ప్రీ ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పించారు. దీంతో పాటు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ ఈఎమ్ఐని రూ.7,543తో అందిస్తోంది. HDFC credit card ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ. 6వేలు క్యాష్ బ్యాక్ వస్తోంది.

ఈ నెల 22వ తేదీ ఫోన్ల డెలివరీ

ఈ నెల 22వ తేదీ ఫోన్ల డెలివరీ

ఈ క్రమంలో కస్టమర్లు ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేస్తే వారికి ఈ నెల 22వ తేదీ నుంచి ఫోన్లను డెలివరీ చేస్తారు. ఫ్రీ ఆర్డరు ద్వారా కొనుగోలుచేసే వారికి రూ. 4,999 కే Gear Sports smartwatchని అందిస్తోంది.

Galaxy Note 9 ఫీచర్లు, స్పెషల్ రివ్యూ !

Galaxy Note 9 ఫీచర్లు, స్పెషల్ రివ్యూ !

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు
6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, డిజైన్

అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, డిజైన్

6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేతో పాటు క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ (1440x 2960పిక్సల్స్)ను గెలాక్సీ నోట్‌ 9లో ఏర్పాటు చేశారు. దీని ద్వారా వ్యూయింగ్ అనుభూతి యూజర్లను సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ముందు, వెనుక భాగాల్లో ఉన్న బాడీకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ కిందపడినా డ్యామేజి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఫోన్ మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగి ఉండటంతో పాటు ఫోన్ ఎడ్జ్‌లు ప్రీమియం లుక్ తో యూజర్లను ఇట్టే కట్టిపడేసాలా డిజైన్ చేశారు.

ప్రాసెసర్

ప్రాసెసర్

గెలాక్సీ నోట్ 9లో లేటెస్ట్ గా వచ్చిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ వాడకంలో స్పీడ్ మరింతగా వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇండియన్ వేరియెంట్‌లో శాంసంగ్ సొంత చిప్‌సెట్ అయిన ఎగ్జినోస్ 9810 ను ఏర్పాటు చేయడం ద్వారా ఫోన్ ఎటువంటి అంతరాయం లేకుండా మీకు సపోర్ట్ ఇస్తుంది.

ర్యామ్, స్టోరేజ్ ఫీచర్లు

ర్యామ్, స్టోరేజ్ ఫీచర్లు

6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లులో గెలాక్సీ నోట్ 9ని ప్రవేశపెట్టారు. అలాగే 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డుతో మరో 512 జీబీ స్టోరేజ్‌ని పెంచుకునే విధంగా దీన్ని రూపొందించారు. మొత్తం స్టోరేజ్ కలిపితే దాదాపు 1 టీబీ వరకు ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేసి మంచి ప్రదర్శన ఇస్తుంది.

కెమెరా

కెమెరా

గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను పొందుపరిచారు. వెనుక భాగంలో ఉన్న కెమెరాలకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను ఇవ్వడం ద్వారా ఫోన్ షేక్ అవుతున్నా ఫొటోలు మాత్రం బ్లర్ అవకుండా వస్తాయి. రెండు కెమెరాల్లో ఒక కెమెరా టెలిఫోటో కెమెరాగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ తో ఒక కెమెరా ద్వారా యూజర్లకు 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ లేదా 10ఎక్స్ డిజిటల్ జూమ్ లభిస్తుంది.

సెల్ఫీ కెమెరా

సెల్ఫీ కెమెరా

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ అభిమానులు అదిరిపోయే విధంగా ఫోటోలను తీసుకోవచ్చు.ఫోన్‌లో ఉన్న ముందు కెమెరా యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి 100 ఫేషియల్ పాయింట్లను గుర్తించి సేవ్ చేసుకుంటుంది. దాంతో ఓ 3డీ మోడల్‌ను రూపొందించుకుంటుంది. ఆ మోడల్ యూజర్ అంతకు ముందు ఇచ్చిన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అనుగుణంగా ఎమోజీలా మారుతుంది. దాన్ని యూజర్ ఉపయోగించుకోవచ్చు.

సరికొత్త డెక్స్ ఫీచర్

సరికొత్త డెక్స్ ఫీచర్

ఈ ఫీచర్ సరికొత్తగా యాడ్ చేశారు. ఈ ఫీచర్ సాయంతో శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేకు కనెక్ట్ చేసుకుని ఫోన్‌ను పీసీలా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. ఇందుకోసం యూజర్లు హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా డివైస్‌లను కనెక్ట్ చేసుకోవాలి. అనంతరం డెక్స్ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఫోన్‌ను కంప్యూటర్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. అలాగే స్క్రీన్‌పై వర్చువల్ కీబోర్డ్ ఫీచర్ కూడా లభిస్తుంది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ రెసిస్టెన్స్‌

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డస్ట్ రెసిస్టెన్స్‌

గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ఐరిస్ స్కానర్‌, వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో రావడం వల్ల నీటిలో తడిసినప్పటికీ ఫోన్ పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిక్స్‌బీ డిజిటల్ అసిస్టెంట్‌, ప్రత్యేకంగా ఫోన్‌పై డెడికేటెడ్ బటన్‌, ఎస్ పెన్ స్టైలస్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ సపోర్ట్ సాయంతో సెల్ఫీలే తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. స్లైడ్స్‌ను ప్రజెంటేషన్ చేసుకోవచ్చు.

బ్యాటరీ,సౌండ్ క్వాలిటీ

బ్యాటరీ,సౌండ్ క్వాలిటీ

ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. అందువల్ల బ్యాటరీ త్వరగా అయిపోదు. బ్యాటరీ అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ అనే ఫీచర్లను కలిగి ఉండటం కూడా ఫోన్ కి అదనపు బలాన్ని ఇస్తోంది. గెలాక్సీ నోట్ 9 లో ఎస్9 సిరీస్ తరహాలోనే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

ఏఆర్ ఎమోజీ అనే కొత్త ఫీచర్ బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్‌లను సరికొత్తగా ఈ ఫోన్లో నిక్షిప్తం చేశారు. కాగా మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు ఈ ఫోన్‌ లభ్యం కానుంది.

ధర

ధర

గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 9: Airtel offers 100GB monthly data, free Amazon Prime subscription more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X