Home
Mobile

చిక్కులో సామ్‌సంగ్, మహిళ పర్సులో పేలిన Galaxy Note 9

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను పేళుళ్ల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా చోటుచేసుకున్న మరొక సంఘటన కంపెనీని మరింతగా చిక్కుల్లోకి నెట్టినట్లయ్యింది.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను పేళుళ్ల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా చోటుచేసుకున్న మరొక సంఘటన కంపెనీని మరింతగా చిక్కుల్లోకి నెట్టినట్లయ్యింది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం సామ్‌సంగ్ లేటెస్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 9 (Galaxy Note 9) నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం లాంగ్ ఐలాండ్‌కు చెందిన డయాన్ చుంగ్ అనే మహిళ సామ్‌సంగ్ పై క్వీన్స్ సుప్రీమ్ కోర్డులో ఫిర్యాదు చేసింది.

ఉన్నట్టుంటి ఓవర్ హీట్ అయిపోయింది..

ఉన్నట్టుంటి ఓవర్ హీట్ అయిపోయింది..

ఈ ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం డయాన్ చుంగ్ ఓ ప్రముఖ కంపెనీలో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా విధులు నిర్వహిస్తున్నారు. సెప్టంబర్ 3 అర్థరాత్రి చుంగ్ ఎలివేటర్‌లో ఉండగా తన చేతిలోని గెలాక్సీ నోట్ 9 ఫోన్ చాలా వేడిగా అనిపించింది. దీంతో ఆమె ఆ ఫోను‌ను వెంటనే ఆపేసి తన పర్సులో పెట్టేసింది. కొద్ది సేపటి తరువాత తన పర్సు నుంచి శబ్థాలతో పాటు పొగలు రావటటాన్ని ఆమె గుర్తించింది. దీంతో పర్సును ఎలివేటర్ పై ఉంచి లిఫ్ట్‌ను అపే ప్రయత్నం చేసింది చుంగ్.

 

 

ఆఖరికి నిళ్లలో ముంచాల్సి వచ్చింది...

ఆఖరికి నిళ్లలో ముంచాల్సి వచ్చింది...

ఎలివేటర్ నుంచి లాబీలోకి చేరుకున్న తరువాత పర్సు లొపల పొగులు కక్కుతోన్న సామ్‌సంగ్ ఫోన్‌ను చుంగ్ బయటకు విసిరేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తన చేతివేళ్లకు కూడా కాలిన గాయాలు అయ్యాయని చుంగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్‌ను బయటకు విసిరేసినప్పటికి పొగలు తగ్గకపోవటంతో, ఓ క్లాత్ సహాయంతో ఫోన్‌ను చేతిలోకి తీసుకుని బకెట్ నీళ్లలో ముంచినట్లు ఆమె తెలిపారు.

 

 

నష్టపరిహారం చెల్లించాల్సిందే..

నష్టపరిహారం చెల్లించాల్సిందే..

ఫోన్ దెబ్బతినటంతో ఇప్పుడు తన క్లయింట్స్‌తో మాట్లాడలేకపోతున్నానని, పర్సులోని ఇతర ముఖ్యమైన కంటెంట్స్ సైతం పాడైపోయాయిని ఆమె ఆరోపించారు. నాసిరకం ఫోన్‌ను అంటగట్టి తనను ఇబ్బందులకు గురి చేసినందుకుగాను తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆమె కోర్టుకు విన్నవించుకున్నారు.

 

 

లోతైన దర్యాప్తుకు ఆదేశాలు...

లోతైన దర్యాప్తుకు ఆదేశాలు...

ఈ ఘటన పై స్పందించిన సామ్‌సంగ్, గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇలాంటి ఫిర్యాదు అందటం ఇదే మొదటిసారి అని, ఫోన్ ఫైర్ అవటానికి గల కారణాలను తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. గెలాక్సీ నోట్ 9 లాంచ్ సమయంలో సామ్‌సంగ్ అఫీషియల్స్ స్పందిస్తూ గెలాక్సీ నోట్ 9 డివైస్ మల్టీ స్టెప్ బ్యాటరీ సేఫ్టీ చెక్‌తో వస్తోందని, ఇది ఫైర్ అయ్యేందుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదని తెలిపారు.

గెలాక్సీ నోట్ 7 విషయంలోనూ ఇదే పరిస్థితి...

గెలాక్సీ నోట్ 7 విషయంలోనూ ఇదే పరిస్థితి...

గెలాక్సీ నోట్ 7 విషయంలోనూ సామ్‌సంగ్ ఇదే విధమైన విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నోట్ 7 ఫోన్‌లు వరసపెట్టి పేలిపోవటంతో దాదాపుగా 25 లక్షల ఫోన్‌లను సామ్‌సంగ్ వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో నోట్ 7 లైనప్‌నే సామ్‌సంగ్ కిల్ చేయవల్సి వచ్చింది.

 

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 9 catches fire in woman’s purse, company faces lawsuit.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X