నేడు ఇండియా మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ అవుతున్నశాంసంగ్ గెలాక్సీ నోట్ 9

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నశాంసంగ్‌ అభిమానులకు గుడ్ న్యూస్.

By Anil
|

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నశాంసంగ్‌ అభిమానులకు గుడ్ న్యూస్.ఎందుకంటే ఈ రోజు డిల్లీలో అధికారికంగా గెలాక్సీ నోట్‌ 9 ఫోన్ ని కంపెనీ లాంచ్ చేయనుంది.కాగా గెలాక్సీ నోట్ 8 విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫోన్ లాంచ్ కాబోతొంది. గెలాక్సీ నోట్ 8 ఇండియాలో భారీ అమ్మకాలను కొల్లగొట్టిన నేపథ్యంలో రానున్న ఫోన్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 కూడా అదే విధంగా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఫోన్ ఫీచర్ల పరంగా ఇతర ఫోన్లకు సవాల్ విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 6GB RAM+128GB ధర రూ. 67,900 కాగా 8GB RAM+512GB ధర రూ. 84,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ను శాంసంగ్‌ అధికారికి వెబ్ సైట్ లో వీక్షించవచ్చు.

ధర....

ధర....

గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.69,900గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.84,900గా ఉంది.

మూడు రంగుల్లో....

మూడు రంగుల్లో....

మిడ్ నైట్ బ్లాక్,ఓషన్ బ్లూ మరియు మెటాలిక్ కాపర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

6.4 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే....
 

6.4 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే....

ఈ డివైజ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845తో రాబోతుంది , అదేవిధంగా రెండో మోడల్‌ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్‌ 9810 చిప్‌సెట్‌ను ఇందులో కలిగి ఉంది. 6.4 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మెరుగైన ఎస్‌-పెన్‌, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌కు ఉన్న మాదిరిగానే కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు....

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు....

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

గతంలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

ధర రూ.67,900
6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 8895 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 9 launch in India today: Here's how to watch it live.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X