దిగ్గజాలను కలవరపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 9,ఆ ఫీచర్లు నిజమైతే..

స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న శాంసంగ్ దిగ్గజాలను కలవరపెడుతోంది.

|

స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న శాంసంగ్ దిగ్గజాలను కలవరపెడుతోంది. స్మార్ట్‌ఫోన్ల రారాజుగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో తీసుకొచ్చిన గెలాక్సీ నోట్‌ 8కు సక్ససర్‌గా దీన్ని తీసుకురాబోతున్నట్టు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఫోన్ నిజంగానే వస్తుందా లేదా అనే దానిపై శాంసంగ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాని సోషల్ మీడియాలో ఇమేజ్ తో సహా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

షియోమి మరో సంచలనం, రూ.10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీషియోమి మరో సంచలనం, రూ.10 వేలకే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ

 గీక్‌బెంచ్‌ రిపోర్టు ప్రకారం ..

గీక్‌బెంచ్‌ రిపోర్టు ప్రకారం ..

ప్రముఖ బెంచ్‌మార్కింగ్‌ సైట్‌ గీక్‌బెంచ్‌ రిపోర్టు ప్రకారం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 9ను జూలై నెలలో విడుదల చేసే అవకాశముందని తెలిపింది. లాంచింగ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు లీక్‌లను అందించింది.

8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌..

8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌..

తాజా లీకేజీల ప్రకారం గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

కేవలం మూడు వేరియంట్లలోనే..
 

కేవలం మూడు వేరియంట్లలోనే..

కానీ అంతకముందు నుంచి వచ్చిన రూమర్ల ప్రకారమైతే గెలాక్సీ నోట్‌ 9 కేవలం మూడు వేరియంట్లోనే మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. ఒకటి 64జీబీ స్టోరేజ్‌, రెండు 128జీబీ స్టోరేజ్‌, మూడు 256జీబీ స్టోరేజ్‌. ఈ మూడు స్టోరేజ్‌ మోడల్స్‌ కూడా 6జీబీ ర్యామ్‌తోనే రూపొందుతున్నాయని చక్కర్లు కొట్టాయి.

తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌

తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌

ఇప్పుడు తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌ ఇచ్చిన లీకేజీ ప్రకారం నాలుగో మోడల్‌ను శాంసంగ్‌ రూపొందిస్తుందని, ఈ మోడల్‌ అత్యంత ఖరీదైన వేరియంట్‌ అని, అది 8జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్‌తో రూపొందిస్తున్నారని లీక్‌ చేశాడు.

లిమిటెడ్‌ ఎడిషన్‌లో..

లిమిటెడ్‌ ఎడిషన్‌లో..

అయితే దాన్ని లిమిటెడ్‌ ఎడిషన్‌లో తీసుకొచ్చి, ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ డివైజ్‌కు సంబంధించే పలు హార్డ్‌వేర్‌ వివరాలను గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌ లిస్టు చేసింది.

6.38 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే

6.38 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే

ఈ డివైజ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845తో వస్తుందని, అదేవిధంగా రెండో మోడల్‌ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్‌ 9810 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6.38 అంగుళాల ఓలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 3850 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మెరుగైన ఎస్‌-పెన్‌, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌కు ఉన్న మాదిరిగానే కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లున్నాయని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్ భార‌త మార్కెట్‌లో రూ.67,900 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 8895 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ స్కాన‌ర్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Note 9 may have an 8GB RAM and 516GB storage variant More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X