ఆ ఒక్కడే టార్గెట్‌గా..?

By Prashanth
|
Samsung Galaxy Note


టెక్ ప్రపంచాన్ని ఉత్కంఠకు లోనుచేసే ఒ సంచలనకర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌కు పోటీగా హెచ్‌టీసీ , జడ్‌టీఈ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫోన్ టాబ్లెట్ స్వభావం కలిగి పెద్ద తెరతో డిజైన్ కాబుడుతున్న ఈ డివైజ్‌లు సామ్‌సంగ్‌కు ఏమేరకు ఎదురొగ్గినిలుస్తాయో చూడాలి....

 

గెలాక్సీ నోట్‌కు ధీటుగా హెచ్‌టీసీ , జడ్‌టీఈ‌లు రూపొందిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు (అంచనా):

 

5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

1080 పిక్సల్ హై డెఫినిషన్ రిసల్యూషన్,

క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,

ఆడ్రినో 320 గ్రాఫిక్స్,

హెచ్‌టీసీ సెన్స్ 5.0 యూజర్ ఇంటర్ ఫేస్,

స్ర్కైబ్ టెక్నాలజీ సపోర్ట్,

హెచ్‌టీసీ సెన్స్ సాఫ్ట్ వేర్,

స్ర్కైబ్ డిజిటల్ పెన్.

ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పీచర్లు:

* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ – ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.

గెలక్సీ నోట్‌కు పోటీగా హెచ్‌టీసీ , జడ్‌టీఈ‌లు రూపొందిస్తున్న ఫాబ్లెట్లు, ఈ ఏడాది ద్వితియాకంలో అందుబాటులోకి రానున్నాయి. ధర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ డివైజ్‌లు ఆశించిన స్థాయిలో వినియోగదారులకు చేరువు అవుతాయిని విశ్లేషకులు భావిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X