ప్రీ-ఆర్డర్ పై సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2
ఇటీవల బాలి, ఇండోనేషియోలో నిర్వహించిన ‘సామ్‌సంగ్ ఫోరమ్ 2014'లో సామ్‌సంగ్, గెలాక్సీ నోట్ ప్రో 12.2 (Galaxy NotePRO 12.2) పేరుతో సరికొత్త పెద్దతెర ట్యాబ్లెట్ డివైస్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ అధిక ముగింపు ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ రూ.65,575 ధరకు ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకశాన్నికల్పిస్తోంది. ప్రీఆర్డర్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ట్యాబ్లెట్ డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 2560× 1600పిక్సల్స్), డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు.
ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్‌తో లభ్యం కాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్సినోస్ 5 ఆక్టా (1.9గిగాహెట్స్ x 4 + 1.3GHz x 4) ప్రాసెసర్‌ను డివైస్‌లో వినియోగించారు. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని మరో 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. శక్తివంతమైన 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీని ట్యాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు.
కనెక్టువిటీ ఫీచర్లు... ఎల్టీఈ/3జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, ఆల్ షేర్ కాస్ట్, బీటీ4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్ + గ్లోనాస్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications