ఫ్లిప్‌కార్ట్‌లోకి సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy On Max
ధర రూ.16,990.
సామ్‌సంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Galaxy On Maxను శుక్రవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.16,900. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సేల్ తేదీ వెల్లడికావల్సి ఉంది.

Social Camera Mode
Social Camera Mode ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ ‘షేర్ ఆన్-ద-గో' ఫీచర్ ద్వారా యూజర్లు సింగిల్ క్లిక్‌తో తమ ఫోటోలను సోషల్ మీడియా యాప్స్‌లో షేర్ చేసుకునే వీలుంటుంది. షేర్ చేసే ముందు ఫోటోలను చక్కగా ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కూడా ఈ సోషల్ కెమెరా మోడ్ కల్పిస్తుంది.

సామ్‌సంగ్ పే మినీ..
Samsung Pay Mini ఫీచర్, ఈ ఫోన్‌కు మరో హైలైట్‌గా నిలిచిపోతుంది. ఈ ఫీచర్ ద్వారా నగదు చెల్లింపును మరింత సురక్షితంగా చేపట్టవచ్చు.

Galaxy On Max స్పెసిఫికేషన్స్...
మెటల్ యుని-బాడీ డిజైన్, 5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ...
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ,

కనెక్టువిటీ ఫీచర్లు..
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్. ఫోన్ బరువు 178 గ్రాములు, చుట్టుకొలత 156.6x78.7x8.1 మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








