సామ్‍సంగ్ Galaxy On8 పై రూ.2500 వరకు తగ్గింపు, ఇప్పుడు రూ.13499కే

సామ్‌సంగ్ నుంచి కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్ Galaxy On8 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ పై ట్రేడ్ అవుతోంది.

సామ్‍సంగ్ Galaxy On8 పై రూ.2500 వరకు తగ్గింపు, ఇప్పుడు రూ.13499కే

Read More : కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్

బిగ్‌బిలియన్ డేస్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా సామ్‌సంగ్ ఈ ఫోన్‌లను అక్టోబర్ 2 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ కెమెరా, 4G VOLTE సపోర్ట్ వంటి విశష్టమైన స్సెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట్ ధర రూ.14,900కు ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.15,900గా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

SBI యూజర్లకు అదనంగా రాయితీ..

SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు ఈ ఫోన్‌ను రూ.13,490కే సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.

మరిన్ని ఆఫర్లు..

ఈ ఫోన్ పై 32జీబి సామ్‌సంగ్ మైక్రోఎస్డీ కార్డ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. No Cost EMI సదుపాయంతో రూ.13,000 వకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సదుపాయాన్ని కూడా కూడా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ పై కల్పిస్తోంది.

Galaxy On8 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల డిస్‌ప్లే, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ S5E7580 (ఎక్సినోస్ 7580) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,

Galaxy On8 స్పెసిఫికేషన్స్...

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

Galaxy On8 స్పెసిఫికేషన్స్...

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G, 3G, 2G), డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Galaxy On8 ఫోన్ ఎస్‌బైక్ సపోర్ట్‌తో వస్తోంది..?

స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

Galaxy On8 ఫోన్ అల్ట్రా డేటా సేవింగ్ మోడ్‌తో వస్తోంది..?

అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ గెలాక్సీ ఆన్5 ప్రో, ఆన్7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌తో వస్తున్నాయి. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌‍లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్‌ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.

జియో నెట్‌వర్క్‌ సపోర్ట్

4జీ VOLTE  సపోర్ట్ తో వస్తోన్న ఈ ఫోన్ జియో నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy On8 Available with best discount offers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot