ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా శాంసంగ్ గెలాక్సీ On8

Written By:

కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి త్వరలో రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ On8 ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనుంది. గోల్డ్ , బ్లాక్, వైట్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ అక్టోబర్ 2 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డే స్పెషల్ కింద ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనున్నారు. కంపెనీ దీని ధరను రూ. 15,900 నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైలెట్ ఫీచర్లతో వస్తున్న ఈ పోన్ స్పెషిపికేషన్స్ ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

న్యూ గెలాక్సీ On8 ఫోన్ 5.5 ఇంచ్ పుల్ హెచ్‌డి సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది. ఈ ఫోన్ డైమండ్ మెటల్ బాడీ కట్‌తో రానున్నట్లు శాంసంగ్ తెలిపింది. రీసెంట్ గా వచ్చిన శాంసంగ్ ఫోన్ల అన్నింటికంటే ఇదే ఉత్తమమైనదని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు UDS (Ultra Data Saving) mode and S bike modeలో ఈ ఫోన్ వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో కింద ఈ ఫోన్ రన్ అవుతుంది. 1.6GHz పవర్ పుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 3జీబి ర్యామ్ అలాగే 16 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజితో పాటు మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 128 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

కెమెరా

13 మెగా ఫిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా విత్ LED flash and f/1.9 apertureతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. 5 మెగా ఫిక్సల్ సెల్పీ కెమెరా విత్ LED flashతో సెల్ఫీలు తీసుకోవచ్చు.

బ్యాటరీ

శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ కు 3300mAh బ్యాటరీని అందించింది. డ్యూయెల్ మైక్రోసిమ్ తో రానున్న ఈ ఫోన్ 4జీ వోల్ట్ కి సపోర్ట్ చేస్తుంది. దీని కొలతలు 151.7x76x7.8mmగా ఉన్నాయి. బరువు 169 గ్రాములు.

మన్నికైన పవర్ పుల్

శాంసంగ్ గెలాక్సీ ఆన్8 ఫోన్ వినియోగదారులకు కరెక్ట్ ఫోన్ అని మన్నికైన పవర్ పుల్ ఫోన్ కావాలనుకునేవారు దీన్ని తీసుకోవచ్చని శాంసంగ్ కంపెనీ మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ తెలిపారు.

పవర్ పుల్ ప్రాసెసర్

ఇది లుక్ మాత్రమే కాకుండా పవర్ పుల్ ప్రాసెసర్ తో కష్టమర్లను ఎక్కడికో తీసుకెళుతుందని అదిరిపోయే డిస్ ప్లే దీనిసొంతమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫ్లిప్ కార్ట్ బిలియన్ డే సేల్ లో ఎక్స్ క్లూజివ్ గా

దీన్ని కంపెనీ ఫ్లిప్ కార్ట్ బిలియన్ డే సేల్ లో ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది. దీని ధర రూ. 15,900. అక్టోబర్ 2 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు మొదలవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Samsung Galaxy On8 Official, to Launch During Flipkart Big Billion Day 2016 Sale Read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot