Galaxy On8 ధర తగ్గింది, ఎంతో తెలుసా..?
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ చేంజ్ స్కీమ్‌లో భాగంగా రూ.12,500 వరకు బెనిఫిట్స్...
సామ్‌సంగ్ నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్ Galaxy On8 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,410 తగ్గింపుతో లభ్యమవుతోంది.
Read More : త్వరలో జియో 4జీ ల్యాప్‌టాప్?

రూ.13,490కే మీ సొంతం...
తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.15,900 ఖరీదు చేసే ఈ ఫోన్‌ను రూ.13,490కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ స్కీమ్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.12,500 వరకు బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలు పై 14జీబి ఐడియా ఇంటర్నెట్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Galaxy On8 స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ S5E7580 (ఎక్సినోస్ 7580) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Galaxy On8 స్పెసిఫికేషన్స్...
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G, 3G, 2G), డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఎస్‌బైక్ మోడ్
Galaxy On8 ఫోన్ ఎస్‌బైక్ సపోర్ట్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

అల్ట్రా డేటా సేవింగ్ మోడ్
Galaxy On8 ఫోన్ అల్ట్రా డేటా సేవింగ్ మోడ్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా యూజర్లు 50 శాతం వరకు మొబైల్ డేటాను ఆదా చేసుకోవచ్చు. ఫీచర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను అల్ట్రా సేవింగ్ మోడ్ ఆప్షన్ ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తూ డేటాను ఆదా చేస్తుంటుంది.


Click it and Unblock the Notifications