శాంసంగ్ 4.0నా లేక 5.0నా ఇప్పుడే..!!

Posted By: Staff

శాంసంగ్ 4.0నా లేక 5.0నా ఇప్పుడే..!!

ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 4.0, గెలాక్సీ ప్లేయర్ 5.0 హ్యాండ్ సెట్స్ రెండూ కూడా అమెరికన్ మొబైల్ మార్కెట్లో విడుదలకు సిద్దమయ్యాయి. ఇండియాలో ఎప్పుడు విడుదల చేయనుందనే విషయాన్ని మాత్రం శాంసంగ్ వెల్లిడంచ లేదు. శాంసంగ్, యాపిల్‌ మద్య మొబైల్ ఉత్పత్తుల విషయంలో గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ విడుదల చేయనున్న గెలాక్సీ ప్లేయర్ 4.0, గెలాక్సీ ప్లేయర్ 5.0 హ్యాండ్ సెట్స్‌ని అధునాతన ఫీచర్స్‌తో విడుదల చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 4.0, గెలాక్సీ ప్లేయర్ 5.0 హ్యాండ్ సెట్స్ రెండు కూడా ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. రెండు హ్యాండ్ సెట్స్ చూడడానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ స్క్రీన్ సైజు ద్వారా వీటి పరిమాణం తెలిసిపోతుంది. శాంసంగ్ గెలాక్సీ 4.0 మొబైల్ 4 ఇంచ్ స్క్రీన్‌తో రాగా, అదే శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 5.0 మొబైల్ 5 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. రెండింటి డిస్ ప్లే కూడా WVGA TFT LCD టెక్నాలజీ తో రూపొందించారు.

శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 4.0, గెలాక్సీ ప్లేయర్ 5.0 హ్యాండ్ సెట్స్ మెమరీ విషయానికి వస్తే 40జిబి వరకు సపోర్ట్ చేస్తాయి. మొబైల్‌తో పాటు 8జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇక మొబైల్స్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఇమేజిలను తీయవచ్చు. అదే విధంగా మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు.

ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురి చేయవు. మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తాయి. యూజర్స్ స్కైపీ ఎకౌంట్స్ ద్వారా వై-పైతో వీడియో కాల్స్‌కి కనెక్ట్ అవ్వోచ్చు. బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఇందులో శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 5.0లో 2500 mAh బ్యాటరీని పొందుపరచడం జరిగింది. అదే శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 4.0లో 1200 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

శాంసంగ్ గెలాక్సీ ప్లేయర్ 4.0, గెలాక్సీ ప్లేయర్ 5.0 హ్యాండ్ సెట్స్‌కు సంబంధించిన మొబైల్ ధరలను ఇంకా అమెరికన్ మార్కెట్లో విడుదల చేయలేదు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు పాఠకుల కొసం ప్రత్యేకంగా అతి త్వరలో అందివ్వడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot