ఆ మధురక్షణాలు మీ సమీప స్టోర్‌లలో ..

Posted By: Staff

ఆ మధురక్షణాలు మీ సమీప స్టోర్‌లలో ..

ఆ మధుర క్షణాల కోసం ఉత్కంఠతో  వేచి ఉన్న భారతీయులకు  తమ తమ కలలను సాకారం చేసుకునే సమయం రానే వచ్చింది. టెక్ ప్రేమికులను ఊరించి.. మైమరిపించిన స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలక్సీ ప్లస్ ఎట్టకేలకు ఇండియాలో విడుదలైంది. ధర రూ.16,290. ఈ స్మార్ట్‌ఫోన్ కోనుగోలు పై  రూ.1299 విలువ చేసే బ్లూటూత్ స్టీరియో హ్యాండ్‌సెట్ పూర్తిగా ఉచితం.

గెలక్సీ సిరీస్ నుంచి 2011లో విడుదలై అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలక్సీ ఏస్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఏస్ ప్లస్’ విడుదలైంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘గెలక్సీ ఏస్ ప్లస్’ ఫీచర్లు క్లుప్తంగా ..

* 3.6 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480 పిక్సల్స్),


*    5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా (రిసల్యూషన్ 2592×1944పిక్సల్స్),


*    3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, వై-ఫై, జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్,


*    నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ),


*    ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్పీకర్స్, ఆడియో జాక్,


*    ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,


*    క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్1 చిప్‌సెట్, సీపీయూ (1జిగాహెడ్జ్),


*    గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (అడిర్నో 200),


* 1300 mAh సామర్ధ్యం గల లితియమ్ ఐయాన్ బ్యాటరీ,


*    ప్రీలోడెడ్ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్,


*    హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ,


*    ధర రూ.16,290.

భారతీయుల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో ఈ ఫోన్ ముందంజలో ఉంటుంది. హ్యాండ్ సెట్ లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు మన్నికైన పనితీరును కలిగి ఉంటాయి. ముఖ్యంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో  నిత్యం గడిపే వారికి ఈ ఫోన్ మరింత అనువైనది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్లి ఓ గెలక్సీ ఏస్ ప్లస్ ను సొంతం చేసుకోండి.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot