సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌తో శామ్‌సంగ్‌..?

Posted By: Prashanth

సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌తో శామ్‌సంగ్‌..?

 

గెలక్సీ సిరీస్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ సీడీఎమ్ఏ హ్యాండ్‌సెట్ ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ ప్రివెయిల్’ ప్రజాదరణను సొంతం చేసుకుంటుంది. శక్తివంతమైన ఈ డివైజ్ అవసరమైన ఫీచర్లతో పూర్తి స్థాయి పని వ్యవస్థను కలిగి ఉంది.యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటంగ్ సిస్టం పై ఈ మొబైల్ రన్ అవుతుంది. క్వాల్కమ్ MSM7627-3 చిప్‌సెట్ వ్యవస్ధను డివైజ్‌లో దోహదం చేశారు. బుల్ట్ చేసిన 800 MHz ప్రాసెసర్ నిర్థిష్టమైన పని సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన ‘3జీ కనెక్టువిటీ’ వ్యవస్ధ వేగవంతమైన వెబ్‌బ్రౌజింగ్‌కు స్పందిస్తుంది.

మరిన్ని ఫీచర్లు:

* 3.2 అంగుళాల టీఎఫ్టీ మల్టీ టచ్ స్ర్కీన్, * 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 117 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * మైక్రో ఎస్డీ విధానం ద్వారా ఎక్స్‌ప్యాండ‌బుల్ మెమరీ 32 జీబి, * బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 216 గంటలు.

‘శామ్‌సంగ్ గెలక్సీ ప్రివెయిల్’ దేశంలోని అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో రూ.10,000లకు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot